News October 9, 2025

కల్వకుర్తిలో ఏసీటీ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

image

కల్వకుర్తి పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్‌ను (ACT) కలెక్టర్ సంతోష్ గురువారం సందర్శించారు. సెంటర్‌లో ఏర్పాటు చేసిన సౌకర్యాలను ఆయన పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. సాంకేతిక విద్యలో నైపుణ్యం సాధించడం ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో విస్తృత ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అన్నారు.

Similar News

News October 9, 2025

జనవరిలో డీఎస్సీ నోటిఫికేషన్!

image

AP: వచ్చే జనవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. నవంబర్ చివర్లో టెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని వెల్లడించారు. ఏటా డీఎస్సీ నిర్వహిస్తామనే మాటకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. మార్చిలో డీఎస్సీ, స్పెషల్ డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. అభ్యర్థులు తమ చదువును కంటిన్యూ చేస్తే తప్పకుండా విజయం సాధించవచ్చు.

News October 9, 2025

BREAKING: రేపు ఉమ్మడి పాలమూరు బంద్: బీసీ సమాజ్

image

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అంశంలో కోర్టు నుంచి స్టే వచ్చేందుకు పిటిషన్లు వేసి, బీసీలను కుట్రపూరితంగా మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా రేపు బంద్‌కు పిలుపునిస్తున్నామని బీసీ సమాజ్ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ సాగర్ వెల్లడించారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42శాతం రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని కాంగ్రెస్ చెప్పిందని గుర్తుచేశారు.

News October 9, 2025

బీజేపీ అంతర్గత చర్చకు నాకు సంబంధం లేదు: బొంతు

image

TG: తనను బీజేపీ అభ్యర్థిగా <<17960394>>ప్రతిపాదించిన<<>> విషయంపై పీసీసీ ఉపాధ్యక్షుడు బొంతు రామ్మోహన్ స్పందించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ నుంచి పోటీ చేస్తానన్న మాటల్లో వాస్తవం లేదన్నారు. తన అభ్యర్థిత్వంపై కాషాయ పార్టీలో అంతర్గత చర్చకు తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ‘నేను కాంగ్రెస్‌లోనే ఉన్నా.. ఉంటాను కూడా. ఇక్కడ సంతృప్తిగా ఉన్నాను’ అని ప్రకటన విడుదల చేశారు.