News October 9, 2025
గద్వాల జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ వివరాలు ఇలా..!

గద్వాల జిల్లాలో మొత్తం 13 మండలాలు ఉన్నాయి. 13 జడ్పీటీసీ స్థానాలు, 13 ఎంపీపీ స్థానాలు, 142 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు జిల్లా వ్యాప్తంగా 696 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. జిల్లాలో 1,93,627 పురుష ఓటర్లు, 1,99,78 మహిళా ఓటర్లు, 10 మంది ఇతరులు మొత్తం 3,93,418 మంది ఓటర్లు ఉన్నారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో వీరందరూ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
Similar News
News October 9, 2025
ట్రంప్‌కు మోదీ శుభాకాంక్షలు

అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్‌తో ఫోన్లో మాట్లాడినట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. గాజా శాంతి ప్రణాళిక విజయవంతమైనందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపినట్లు ట్వీట్ చేశారు. భారత్, US మధ్య ట్రేడ్ చర్చల పురోగతిపై సమీక్షించినట్లు తెలిపారు. భవిష్యత్‌లో ఇరు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు కొనసాగించేందుకు అంగీకరించినట్లు పేర్కొన్నారు.
News October 9, 2025
భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు..!

✓కొత్తగూడెం: చిట్టీల మోసం కేసులో వ్యక్తికి ఐదేళ్ల జైలు శిక్ష
✓పినపాక ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేసిన సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట
✓పాల్వంచ పెద్దమ్మ గుడికి రూ.41 లక్షలకు పైగా ఆదాయం
✓బీసీ రిజర్వేషన్ అంతా డ్రామా: రేగా
✓టేకులపల్లిలో వర్షాలతో దెబ్బతిన్న పత్తి పంట
✓రసాభాసగా పాల్వంచ బీజేపీ నాయకుల సమావేశం
✓కొత్తగూడెం: బీజేపీ నుంచి CPIలో చేరికలు
✓బస్ భవన్ ముట్టడి నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకుల అరెస్ట్
News October 9, 2025
ట్రంప్ మెడలో నోబెల్ మెడల్.. AI ఇమేజ్ షేర్ చేసిన నెతన్యాహు

US ప్రెసిడెంట్ ట్రంప్‌కు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని ఇజ్రాయెల్ PM నెతన్యాహు సూచించారు. అందుకు ఆయన అర్హుడని, ఇజ్రాయెల్-హమాస్ మధ్య సీజ్‌ఫైర్, బందీల విడుదలకు ఎంతో కృషి చేశారని ఆకాశానికెత్తారు. నోబెల్ శాంతి బహుమతి ప్రకటనకు ఒకరోజు ముందు నెతన్యాహు తన స్నేహితుడి(ట్రంప్) కోసం ఈ ట్వీట్ చేయడం గమనార్హం. ట్రంప్ నోబెల్ మెడల్ మెడలో వేసుకోగా నెతన్యాహు సహా మరికొందరు చప్పట్లు కొడుతున్న AI ఇమేజ్‌ను షేర్ చేశారు.