News October 9, 2025
ముగ్గురితో మొదలై 11వేలమందితో పయనం

మంత్రులు అమిత్ షా, అశ్వినీ వైష్ణవ్ ట్వీట్లతో వార్తల్లోకెక్కిన ZOHO, దాని ఫౌండర్ శ్రీధర్‌పై చర్చ జరుగుతోంది. TN లో పేదింట పుట్టిన ఆయన మద్రాస్ IIT, ప్రిన్స్‌టన్ (US)లలో చదివారు. ‘క్వాల్కమ్’ లో పనిచేశారు. 1996లో ఇండియా వచ్చి ‘అడ్వెంట్ నెట్’ స్థాపించారు. అదే జోహోగా మారింది. ముగ్గురితో స్టార్టై ఇపుడు 11000 మందితో ₹1.03లక్షల కోట్లకు ఎదిగింది. ఆయన సేవలకు గుర్తింపుగా కేంద్రం 2021లో పద్మశ్రీ అందించింది.
Similar News
News October 9, 2025
ట్రంప్‌కు మోదీ శుభాకాంక్షలు

అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్‌తో ఫోన్లో మాట్లాడినట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. గాజా శాంతి ప్రణాళిక విజయవంతమైనందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపినట్లు ట్వీట్ చేశారు. భారత్, US మధ్య ట్రేడ్ చర్చల పురోగతిపై సమీక్షించినట్లు తెలిపారు. భవిష్యత్‌లో ఇరు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు కొనసాగించేందుకు అంగీకరించినట్లు పేర్కొన్నారు.
News October 9, 2025
ట్రంప్ మెడలో నోబెల్ మెడల్.. AI ఇమేజ్ షేర్ చేసిన నెతన్యాహు

US ప్రెసిడెంట్ ట్రంప్‌కు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని ఇజ్రాయెల్ PM నెతన్యాహు సూచించారు. అందుకు ఆయన అర్హుడని, ఇజ్రాయెల్-హమాస్ మధ్య సీజ్‌ఫైర్, బందీల విడుదలకు ఎంతో కృషి చేశారని ఆకాశానికెత్తారు. నోబెల్ శాంతి బహుమతి ప్రకటనకు ఒకరోజు ముందు నెతన్యాహు తన స్నేహితుడి(ట్రంప్) కోసం ఈ ట్వీట్ చేయడం గమనార్హం. ట్రంప్ నోబెల్ మెడల్ మెడలో వేసుకోగా నెతన్యాహు సహా మరికొందరు చప్పట్లు కొడుతున్న AI ఇమేజ్‌ను షేర్ చేశారు.
News October 9, 2025
కోటరీ లబ్ధికే PPP పేరిట మెడికల్ కాలేజీల పందేరం: సజ్జల

తన సొంత కోటరీకి లబ్ధి కలిగేలా CBN PPP పేరుతో మెడికల్ కాలేజీలను కట్టబెడుతున్నారని YCP నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. జగన్ 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి 7 నిర్మాణాలు పూర్తిచేస్తే, అందులో 5 CM ప్రైవేటుకు అప్పగించేశారని విమర్శించారు. పేదలకు అన్యాయం చేస్తున్న ఆయన చర్యలను తమ పార్టీ ప్రతిఘటిస్తుందని పేర్కొన్నారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ చేపట్టామని పోస్టర్‌ను రిలీజ్ చేశారు.