News October 9, 2025
22 ఏళ్ల సినీ ప్రయాణం.. హీరోయిన్ ఎమోషనల్ పోస్ట్

‘లేడీ సూపర్ స్టార్’ నయనతార సినీ పరిశ్రమలోకి వచ్చి 22 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆమె ఎమోషనల్ ట్వీట్ చేశారు. ‘మొదటి సారి కెమెరా ముందు నిల్చొని 22 ఏళ్లయింది. సినిమాలే ప్రపంచమవుతాయని నాకు తెలియదు. ప్రతి ఫ్రేమ్, ప్రతి షాట్, ప్రతి మౌనం నాకు ధైర్యాన్ని ఇవ్వడమే కాకుండా నన్ను తీర్చిదిద్దాయి’ అని పేర్కొన్నారు. ఈ బ్యూటీ 2003లో ‘మనస్సినక్కరే’ అనే మలయాళ మూవీతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.
Similar News
News October 9, 2025
ఎలక్షన్ నోటిఫికేషన్ నిలిపివేత

TG: స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌ను నిలిపివేస్తూ SEC ప్రకటన విడుదల చేసింది. BC రిజర్వేషన్లతో పాటు నోటిఫికేషన్‌పై హైకోర్టు స్టే విధించడంతో ఈ నిర్ణయం తీసుకుంది. BCలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ఇటీవల GO-9ను జారీ చేసింది. దీని ప్రకారమే SEC షెడ్యూల్ ప్రకటించి, ఇవాళ తొలి విడత ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే GO-9 చెల్లదంటూ కొందరు కోర్టుకు వెళ్లడంతో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది.
News October 9, 2025
నైట్ డ్యూటీలతో సంతానోత్పత్తిపై ప్రభావం

నైట్‌షిఫ్టుల్లో ఎక్కువగా పనిచేయడం వల్ల మహిళల సంతానోత్పత్తిపై ప్రభావం పడుతుందంటున్నారు గైనకాలజిస్టులు. ‘అస్తవ్యస్త పనివేళలతో హార్మోన్ల సమస్యలు, పీరియడ్లు మిస్సవడం వల్ల గర్భధారణలో ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటిస్తూ పోషకాహారం, తగినంత నిద్ర ఉండేలా చూసుకోవాలి’ అని సూచిస్తున్నారు.
* ప్రతిరోజూ మహిళలు, చైల్డ్ కేర్ కంటెంట్ కోసం <<-se_10014>>వసుధ కేటగిరీ<<>>లోకి వెళ్లండి.
News October 9, 2025
ట్రంప్‌కు మోదీ శుభాకాంక్షలు

అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్‌తో ఫోన్లో మాట్లాడినట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. గాజా శాంతి ప్రణాళిక విజయవంతమైనందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపినట్లు ట్వీట్ చేశారు. భారత్, US మధ్య ట్రేడ్ చర్చల పురోగతిపై సమీక్షించినట్లు తెలిపారు. భవిష్యత్‌లో ఇరు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు కొనసాగించేందుకు అంగీకరించినట్లు పేర్కొన్నారు.