News October 9, 2025

కార్యకర్తలకు ఏ కష్టమొచ్చినా ఆదుకుంటాం: లోకేశ్

image

AP: TDP కార్యకర్తలంతా తన కుటుంబ సభ్యులని, వారికి ఏ కష్టమొచ్చినా ఆదుకోవడం తన బాధ్యత అని మంత్రి నారా లోకేశ్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అనుచరుల దాడిలో గాయపడి, అస్వస్థతతో ఇటీవల మరణించిన శేషగిరిరావు కుటుంబ సభ్యులను ఉండవల్లికి రప్పించి మాట్లాడారు. ఈవీఎం ధ్వంసం ఘటనలో ఆయన గట్టిగా పోరాడారని, స్ఫూర్తిగా నిలిచారని అన్నారు. ఇలాగే ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని అన్నారు.

Similar News

News October 9, 2025

ట్రంప్‌కు నోబెల్ ఇవ్వకుంటే.. నార్వే భవిష్యతేంటి?

image

2025కు గాను నోబెల్ శాంతి బహుమతిని రేపు ప్రకటించనున్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. నార్వేజియన్ నోబెల్ కమిటీ విజేతను డిసైడ్ చేయనుంది. దీంతో నార్వే నేతలు, ప్రజల్లో ఆందోళన మొదలైంది. ట్రంప్‌ను నోబెల్ బహుమతికి ఎంపిక చేయకపోతే ఆ ప్రభావం US-నార్వే రిలేషన్స్‌పై పడుతుందని అభిప్రాయపడుతున్నారు. చైనా, భారత్ వంటి అగ్రదేశాలనే లెక్కచేయని ట్రంప్ తమపై కఠిన చర్యలు తీసుకునే ప్రమాదముందని ఆందోళన చెందుతున్నారు.

News October 9, 2025

ఎలక్షన్ నోటిఫికేషన్ నిలిపివేత

image

TG: స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌ను నిలిపివేస్తూ SEC ప్రకటన విడుదల చేసింది. BC రిజర్వేషన్లతో పాటు నోటిఫికేషన్‌పై హైకోర్టు స్టే విధించడంతో ఈ నిర్ణయం తీసుకుంది. BCలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ఇటీవల GO-9ను జారీ చేసింది. దీని ప్రకారమే SEC షెడ్యూల్ ప్రకటించి, ఇవాళ తొలి విడత ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే GO-9 చెల్లదంటూ కొందరు కోర్టుకు వెళ్లడంతో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది.

News October 9, 2025

నైట్ డ్యూటీలతో సంతానోత్పత్తిపై ప్రభావం

image

నైట్‌షిఫ్టుల్లో ఎక్కువగా పనిచేయడం వల్ల మహిళల సంతానోత్పత్తిపై ప్రభావం పడుతుందంటున్నారు గైనకాలజిస్టులు. ‘అస్తవ్యస్త పనివేళలతో హార్మోన్ల సమస్యలు, పీరియడ్లు మిస్సవడం వల్ల గర్భధారణలో ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటిస్తూ పోషకాహారం, తగినంత నిద్ర ఉండేలా చూసుకోవాలి’ అని సూచిస్తున్నారు.
* ప్రతిరోజూ మహిళలు, చైల్డ్ కేర్ కంటెంట్ కోసం <<-se_10014>>వసుధ కేటగిరీ<<>>లోకి వెళ్లండి.