News October 9, 2025
MNCL: ‘మహిళలు, బాలికలు, విద్యార్థినుల భద్రతే షీటీం లక్ష్యం’

మహిళలు, బాలికలు, విద్యార్థినుల భద్రతే లక్ష్యంగా షీటీం పనిచేస్తున్నట్లు మగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. కమిషనరేట్‌లో రెండు షీటీం బృందాలు పనిచేస్తూ మహిళ భద్రత, రక్షణ చర్యలు తదితర అంశాలపై అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థినులు, మహిళలు అత్యవసర పరిస్థితుల్లో మంచిర్యాల జోన్ షీటీం నంబర్ 8712659386 సంప్రదించాలన్నారు. డయల్ 100కు కాల్ చేసి తక్షణ సహాయం పొందాలన్నారు.
Similar News
News October 10, 2025
NTR వైద్య సేవలను ఆపొద్దు: మంత్రి సత్యకుమార్

AP: సీఎంతో మాట్లాడి NTR వైద్య సేవల నెట్‌వర్క్ ఆస్పత్రుల <<17957233>>సమస్యలు<<>> పరిష్కరిస్తామని మంత్రి సత్యకుమార్ హామీ ఇచ్చారు. ‘ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి రూ.2,500కోట్ల బకాయిలున్నాయి. ఇటీవల రూ.250కోట్లు విడుదల చేశాం. రూ.670కోట్ల బిల్లులు అధికారులు అప్లోడ్ చేశారు. మరో రూ.2వేల కోట్లు స్క్రూటినీలో ఉన్నాయి. గత ప్రభుత్వం పెట్టిన బకాయిల వల్ల ఈ పరిస్థితి వచ్చింది. వైద్య సేవల్ని ఆపొద్దు’ అని కోరారు.
News October 10, 2025
VJA: అమ్మవారిని దర్శించుకున్న హీరో ఆకాశ్ పూరి

ఇంద్రకీలాద్రిపై వేంచేసిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని గురువారం రాత్రి సినీ హీరో ఆకాష్ పూరి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు అమ్మవారి దర్శనం చేయించిన అనంతరం వేద పండితుల చేత వేద ఆశీర్వచనం అందించారు. అనంతరం ఇంద్రకీలాద్రిపై ఉన్న శివాలయాన్ని కూడా దర్శించారు. కార్యక్రమంలో భాగంగా పలువురు అభిమానులు ఆయనతో ఫొటోలు దిగారు.
News October 10, 2025
త్వరలోనే పెండింగ్ రాయితీలు చెల్లిస్తాం: లోకేశ్

AP: IT, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలకు త్వరలోనే పెండింగ్ రాయితీలు చెల్లించేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి లోకేశ్ అధికారులను ఆదేశించారు. ఆ శాఖపై సమీక్ష సందర్భంగా మాట్లాడుతూ.. ‘స్టార్టప్‌ల వృద్ధిలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపాలి. మరో 2 నెలల్లో వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా వెయ్యి సేవలను అందుబాటులోకి తేవాలి’ అని అన్నారు. రేపు క్యాబినెట్ భేటీలో ప్రవేశపెట్టనున్న క్వాంటమ్ కంప్యూటింగ్ పాలసీపైనా చర్చించారు.