News October 9, 2025

BC రిజర్వేషన్లు: హైకోర్టులో వాదనలు ఇలా..

image

TG: BCలకు 42% రిజర్వేషన్లు కల్పించడంపై దాఖలైన పిటిషన్లపై HCలో విచారణ కొనసాగుతోంది. ప్రభుత్వం తరఫున AG సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. BC కులగణన చేయాలని క్యాబినెట్ నిర్ణయించిందన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసిందని చెప్పారు. డోర్‌2డోర్ సర్వేకు అన్ని పార్టీలూ మద్దతిచ్చినట్లు తెలిపారు. సర్కార్ నియమించిన సీనియర్ లాయర్ సింఘ్వీ వర్చువల్‌గా వాదిస్తున్నారు.

Similar News

News October 10, 2025

హనుమకొండ: ఐటీఐ కళాశాలలో అప్రెంటిస్‌షిప్ మేళా

image

ఈ నెల 13న హనుమకొండ ఐటీఐ కళాశాలలో అప్రెంటిస్‌షిప్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ జి.సక్రు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు apprenticeshipindia.gov.in/mela-registrationలో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. సంబంధిత ధ్రువపత్రాలతో మేళాకు హాజరుకావాలని సూచించారు. ఐటీఐ పాసై 28 ఏళ్ల లోపు ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.

News October 10, 2025

TODAY HEADLINES

image

✒ తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్
✒ BC రిజర్వేషన్ల జీవో, ఎన్నికల నోటిఫికేషన్‌పై హైకోర్టు స్టే
✒ BCలకు 42% రిజర్వేషన్లు ఇచ్చాకే ఎన్నికలు: TPCC చీఫ్
✒ APలో రేపటి నుంచి NTR వైద్య సేవలు బంద్: నెట్‌వర్క్ ఆస్పత్రులు
✒ NOVలో టెట్, JANలో DSC నోటిఫికేషన్: మంత్రి లోకేశ్
✒ మోదీతో భేటీ.. వికసిత్ భారత్ జర్నీలో భాగం అవుతామన్న బ్రిటన్ PM స్టార్మర్
✒ WWCలో భారత్‌పై సౌతాఫ్రికా విజయం

News October 10, 2025

IPS ఆత్మహత్య.. DGPపై కేసు నమోదు

image

హరియాణాలో సంచలనం సృష్టించిన IPS ఆఫీసర్ పూరన్ కుమార్ <<17954358>>ఆత్మహత్య<<>> కేసులో ఆ రాష్ట్ర డీజీపీ శత్రుజీత్ సింగ్‌పై కేసు నమోదైంది. పూరన్ భార్య, IAS అన్మీత్ కుమార్ ఫిర్యాదుతో డీజీపీతో పాటు రోహ్‌తక్ ఎస్పీ నరేంద్ర బిజర్నియాపైనా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు ఫైల్ అయింది. మంగళవారం పూరన్ కుమార్ తన తుపాకీతో కాల్చుకొని చనిపోయారు. ఉన్నతాధికారుల కుల వివక్ష వేధింపులతోనే తన భర్త ఆత్మహత్య చేసుకున్నారని భార్య ఆరోపించారు.