News October 9, 2025

MHBD: ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

image

జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉందని జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ తెలిపారు. MHBD జిల్లాలో మొదటి విడతలో 9 ZPTC , 104 MPTC స్థానాలకు 554 పోలింగ్ కేంద్రాల ద్వారా ఎన్నికల ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. నేటి నుంచి అక్టోబర్ 11 వరకు నామినేషన్ల స్వీకరణ, అక్టోబర్ 12న పరిశీలన, 15 వరకు ఉపసంహరణ ఉంటుందన్నారు.అక్టోబర్ 23న మొదటి దఫా ఎన్నికలు నవంబర్ 11న ఫలితాలు వెలువడతాయన్నారు.

Similar News

News October 10, 2025

IPS ఆత్మహత్య.. DGPపై కేసు నమోదు

image

హరియాణాలో సంచలనం సృష్టించిన IPS ఆఫీసర్ పూరన్ కుమార్ <<17954358>>ఆత్మహత్య<<>> కేసులో ఆ రాష్ట్ర డీజీపీ శత్రుజీత్ సింగ్‌పై కేసు నమోదైంది. పూరన్ భార్య, IAS అన్మీత్ కుమార్ ఫిర్యాదుతో డీజీపీతో పాటు రోహ్‌తక్ ఎస్పీ నరేంద్ర బిజర్నియాపైనా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు ఫైల్ అయింది. మంగళవారం పూరన్ కుమార్ తన తుపాకీతో కాల్చుకొని చనిపోయారు. ఉన్నతాధికారుల కుల వివక్ష వేధింపులతోనే తన భర్త ఆత్మహత్య చేసుకున్నారని భార్య ఆరోపించారు.

News October 10, 2025

పటాన్‌‌చెరు LIGలో పేలుడు

image

పటాన్‌చెరులోని రామచంద్రపురంలోని LIGలో గురువారం రాత్రి పేలుడు సంభవించింది. ఇందులో గ్యాస్ లీక్ కాగా కట్టడి చేసేందుకు ప్రయత్నించిన సమయంలో పేడులు జరిగింది. ఈ ఘటనలో అనంత్ స్వరూప్(22) అనే మృతి చెందినట్లు తెలిసింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. కాగా ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.