News October 9, 2025

గుంటూరు మిర్చి యార్డులో నేటి ధరలివే.!

image

గుంటూరు మిర్చి యార్డుకు గురువారం మొత్తం 75,000 బస్తాల A/C సరకు వచ్చింది. మార్కెట్‌లో ధరలు స్థిరంగా ఉన్నా, కొన్ని రకాల ధరలు ఆకర్షణీయంగా పలికాయి. పసుపు రకం మిర్చి ధర కిలోకు ₹200 నుంచి ₹250 వరకు అత్యధికంగా నమోదైంది. తేజా A/C రకం ధర కిలోకు ₹100 నుంచి ₹152 వరకు పలికింది. 341 A/C రకం గరిష్ఠంగా ₹165కి చేరుకుంది. నాటు రకాలైన 334, సూపర్ టెన్ రకాలు కిలోకు ₹90 నుంచి ₹155 వరకు ట్రేడ్ అయ్యాయి.

Similar News

News October 9, 2025

GNT: అక్రమ విద్యుత్ కనెక్షన్లకు అపరాధ రుసుం

image

నిబంధనలకు విరుద్ధంగా కరెంటు వినియోగిస్తున్న 53 కనెక్షన్లకు విద్యుత్ శాఖ అధికారులు గురువారం రూ. 4.86 లక్షల అపరాధ రుసుం విధించారు. విద్యుత్ శాఖలోని విజిలెన్స్, ఆపరేషన్స్ విభాగాలు సంయుక్తంగా గురువారం చమల్లమూడి, కాట్రపాడు, ముట్లూరు, పల్లాడు, సౌపాడు, వింజనంపాడు ప్రాంతాల్లో 1,965 సర్వీసులను తనిఖీ చేశాయి. ఈ తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా కరెంటు వాడుతున్న కనెక్షన్లను గుర్తించి, వాటికి జరిమానా విధించారు.

News October 9, 2025

పత్తి కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు చేయాలి: సీఎస్

image

రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని సీఎస్ విజయానంద్ అధికారులను ఆదేశించారు. నవంబర్ 1వ తేదీ నుంచి పత్తి దిగుబడులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో సీఎస్ గురువారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఖరీఫ్ ధాన్యం సేకరణకు ఇ-పంటలో నమోదు తప్పనిసరి అని స్పష్టం చేశారు. ధాన్యం, పత్తి కొనుగోళ్ల విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండి, రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు.

News October 9, 2025

ధాన్యం కొనుగోళ్లలో దళారీ వ్యవస్థను కట్టడి చేయాలి: జేసీ

image

GNT జిల్లాలో ధాన్యం సేకరణపై నేడు కలెక్టరేట్‌లో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో JC ఆశుతోష్ శ్రీవాస్తవ మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లలో దళారీ వ్యవస్థను పూర్తిగా కట్టడి చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో 50 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణను లక్ష్యంగా నిర్దేశించినట్లు తెలిపారు. ధాన్యం కనీస మద్దతు ధరను సాధారణ రకం క్వింటాలుకు రూ. 2,369/గా, ‘A’ గ్రేడ్ రకం క్వింటాలుకు రూ. 2,389/గా నిర్ణయించామన్నారు.