News October 9, 2025
ప్రజలను రెచ్చగొట్టేందుకే జగన్ బలప్రదర్శన: సత్యకుమార్

AP: నర్సీపట్నం పర్యటనకు కారణమేంటో వైసీపీ చీఫ్ జగన్ స్పష్టంగా చెప్పాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రశ్నించారు. ప్రజలను రెచ్చగొట్టేందుకు బలప్రదర్శన చేస్తున్నారని దుయ్యబట్టారు. గతంలో ఆయన పర్యటనలు ఎలా సాగాయో చూశామన్నారు. మెడికల్ కాలేజీలపై జగన్‌కు ఎలాంటి చిత్తశుద్ధి లేదని ఫైరయ్యారు. వికృత మనస్తత్వం ఉన్న జగన్‌కు ఏపీ అభివృద్ధి ఇష్టం లేదని మంత్రి విమర్శించారు.
Similar News
News October 10, 2025
TODAY HEADLINES

✒ తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్
✒ BC రిజర్వేషన్ల జీవో, ఎన్నికల నోటిఫికేషన్‌పై హైకోర్టు స్టే
✒ BCలకు 42% రిజర్వేషన్లు ఇచ్చాకే ఎన్నికలు: TPCC చీఫ్
✒ APలో రేపటి నుంచి NTR వైద్య సేవలు బంద్: నెట్‌వర్క్ ఆస్పత్రులు
✒ NOVలో టెట్, JANలో DSC నోటిఫికేషన్: మంత్రి లోకేశ్
✒ మోదీతో భేటీ.. వికసిత్ భారత్ జర్నీలో భాగం అవుతామన్న బ్రిటన్ PM స్టార్మర్
✒ WWCలో భారత్‌పై సౌతాఫ్రికా విజయం
News October 10, 2025
IPS ఆత్మహత్య.. DGPపై కేసు నమోదు

హరియాణాలో సంచలనం సృష్టించిన IPS ఆఫీసర్ పూరన్ కుమార్ <<17954358>>ఆత్మహత్య<<>> కేసులో ఆ రాష్ట్ర డీజీపీ శత్రుజీత్ సింగ్‌పై కేసు నమోదైంది. పూరన్ భార్య, IAS అన్మీత్ కుమార్ ఫిర్యాదుతో డీజీపీతో పాటు రోహ్‌తక్ ఎస్పీ నరేంద్ర బిజర్నియాపైనా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు ఫైల్ అయింది. మంగళవారం పూరన్ కుమార్ తన తుపాకీతో కాల్చుకొని చనిపోయారు. ఉన్నతాధికారుల కుల వివక్ష వేధింపులతోనే తన భర్త ఆత్మహత్య చేసుకున్నారని భార్య ఆరోపించారు.
News October 10, 2025
NTR వైద్య సేవలను ఆపొద్దు: మంత్రి సత్యకుమార్

AP: సీఎంతో మాట్లాడి NTR వైద్య సేవల నెట్‌వర్క్ ఆస్పత్రుల <<17957233>>సమస్యలు<<>> పరిష్కరిస్తామని మంత్రి సత్యకుమార్ హామీ ఇచ్చారు. ‘ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి రూ.2,500కోట్ల బకాయిలున్నాయి. ఇటీవల రూ.250కోట్లు విడుదల చేశాం. రూ.670కోట్ల బిల్లులు అధికారులు అప్లోడ్ చేశారు. మరో రూ.2వేల కోట్లు స్క్రూటినీలో ఉన్నాయి. గత ప్రభుత్వం పెట్టిన బకాయిల వల్ల ఈ పరిస్థితి వచ్చింది. వైద్య సేవల్ని ఆపొద్దు’ అని కోరారు.