News October 9, 2025
అన్నమయ్యా.. ఇదేంటయ్యా.!

పదకవితా పితామహుడు అన్నమాచార్యుల పేరుతో వెలుగొందుతున్న ఈ జిల్లా.. ఇప్పుడు అక్రమ, నకిలీ మద్యం ఉత్పత్తికి ప్రధాన కేంద్రంగా మారుతోంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఈ ప్రాంతానికి చెందిన వారే నకిలీ మద్యం దందాలలో ప్రధాన నిందితులుగా ఉండటం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రభుత్వాల కనుసన్నల్లోనే ఈ అక్రమాలు జరుగుతున్నాయనే వాదన బలంగా వినిపిస్తోంది.
Similar News
News October 10, 2025
దేశంలో బురఖా బ్యాన్‌కు ప్లాన్ చేస్తున్న మెలోని!

ఇటలీలో ఇస్లామిక్ తీవ్రవాదం, వేర్పాటువాదం కట్టడికి ఆ దేశ PM మెలోని సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. బహిరంగ ప్రదేశాల్లో బురఖా, హిజాబ్, నిఖాబ్ ధరించడం, మసీదులకు ఫండింగ్‌ను బ్యాన్ చేయనున్నట్లు సమాచారం. రిలీజియస్ ఫ్రీడమ్ ఉండాలి కానీ, రాజ్యాంగానికి విరుద్ధంగా ఉండకూడదని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల పాలస్తీనాకు మద్దతుగా అక్కడ చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారడం తెలిసిందే.
News October 10, 2025
న్యూస్ అప్‌డేట్స్ @12am

*తెలంగాణ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు మధ్యంతర బెయిల్ రద్దు చేయాలని తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ. కీలకమైన సాక్ష్యాలు లభించాయన్న అడిషనల్ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా. విచారణ అక్టోబర్ 14కు వాయిదా.
*సుప్రీంకోర్టులో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరుల ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ నవంబర్ 3కు వాయిదా
News October 10, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (అక్టోబర్ 10, శుక్రవారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.56 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.08 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.03 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.20 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.58 గంటలకు
✒ ఇష: రాత్రి 7.10 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.