News October 9, 2025

ఈ నెల 23లోగా అభ్యంతరాలు తెలపాలి: ఖమ్మం కలెక్టర్

image

ఖమ్మం జిల్లాలో మాన్యువల్ స్కావెంజర్స్‌పై ప్రజలు తమ అభ్యంతరాలను ఈ నెల 23వ తేదీలోపు తెలియజేయాలని కలెక్టర్ అనుదీప్ కోరారు. మాన్యువల్ స్కావెంజర్స్ రిహాబిలిటేషన్ చట్టం-2013 ప్రకారం సర్వే కమిటీలు ఏర్పాటు చేయగా, జిల్లాలో స్కావెంజర్లను గుర్తించలేదని కలెక్టర్ తెలిపారు. ఎవరికైనా అభ్యంతరాలు లేదా సమాచారం ఉంటే కలెక్టరేట్‌లోని షెడ్యూల్ కులాల అభివృద్ధి (SC Development) కార్యాలయంలో అందజేయాలని ఆయన సూచించారు.

Similar News

News October 10, 2025

ఖమ్మం: బావిలో జారిపడి మహిళ మృతి

image

ప్రమాదవశాత్తు బావిలో పడి ఓ మహిళ మృతి చెందిన ఘటన తిరుమలాయపాలెం మండలంలో చోటుచేసుకుంది. పిండిప్రోలు గ్రామానికి చెందిన కాంపాటి ఆశాకుమారి(45) పశువుల మేతకోసం చేను వద్దకు వెళ్లి గడ్డి కోస్తుండగా ప్రమాదవశాత్తు బావిలో జారి పడడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు.

News October 9, 2025

స్థానిక పోరు.. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ

image

స్థానిక సంస్థల ఎన్నికలకు ఖమ్మం జిల్లా యంత్రాంగం సన్నద్ధమైంది. ఎన్నికలపై హైకోర్టు బుధవారం అభ్యంతరం చెప్పకపోవడంతో గురువారం(నేడు) MPTC/ZPTC నోటిఫికేషన్ విడుదలకు సిద్ధమైంది. మొదటి విడుతలో జిల్లాలోని 20 ZPTC స్థానాలకు గానూ 10, 283 MPTC స్థానాలకు గానూ 149 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆయా మండలాల్లోని ప్రభుత్వ కార్యాలయాల్లో నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీంతో ఆశావహుల్లో జోష్ నెలకొంది.

News October 9, 2025

బాలల డాక్యుమెంట్‌లు 15 రోజుల్లో జారీ చేయాలి: కలెక్టర్

image

ఖమ్మం జిల్లాలోని బాలల సంరక్షణ కేంద్రాల్లో ఉన్న పిల్లలకు 15 రోజుల్లోగా ఆధార్, కుల ధ్రువపత్రాలు సహా ఇతర ప్రభుత్వ డాక్యుమెంట్‌లను జారీ చేయాలని కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. బుధవారం జరిగిన చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. పోక్సో కేసులపై చర్యలు వేగవంతం చేసి, అర్హులైన వారికి పరిహారం అందించాలని సూచించారు. పిల్లల భద్రతకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ తెలిపారు.