News October 9, 2025

GNT: 400 కోట్ల స్కామ్.. జిల్లాలో ఐటీ రైడ్స్

image

ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న ఐటీ దాడులు హాట్ టాపిక్‌గా మారాయి. గత కొన్నేళ్లుగా నకిలీ కందిపప్పు, పెసరపప్పు తయారీ చేస్తున్న పలు పప్పు మిల్లుల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. రూ. 400 కోట్ల స్కామ్ జరిగినట్లు గుర్తించిన ఐటీ అధికారులు 30తో బృందాలు గుంటూరు, తెనాలి, వినుకొండ, విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం, ప్రాంతాల్లోని దాల్ మిల్లులు, ఏజెంట్ల ఇళ్లు, కార్యాలయాలపై సోదాలు చేపట్టారు.

Similar News

News October 10, 2025

దేశంలో బురఖా బ్యాన్‌‌కు ప్లాన్ చేస్తున్న మెలోని!

image

ఇటలీలో ఇస్లామిక్ తీవ్రవాదం, వేర్పాటువాదం కట్టడికి ఆ దేశ PM మెలోని సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. బహిరంగ ప్రదేశాల్లో బురఖా, హిజాబ్, నిఖాబ్‌‌ ధరించడం, మసీదులకు ఫండింగ్‌ను బ్యాన్ చేయనున్నట్లు సమాచారం. రిలీజియస్ ఫ్రీడమ్ ఉండాలి కానీ, రాజ్యాంగానికి విరుద్ధంగా ఉండకూడదని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల పాలస్తీనాకు మద్దతుగా అక్కడ చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారడం తెలిసిందే.

News October 10, 2025

న్యూస్ అప్‌డేట్స్ @12am

image

*తెలంగాణ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు మధ్యంతర బెయిల్ రద్దు చేయాలని తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ. కీలకమైన సాక్ష్యాలు లభించాయన్న అడిషనల్ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా. విచారణ అక్టోబర్ 14కు వాయిదా.
*సుప్రీంకోర్టులో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరుల ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ నవంబర్ 3కు వాయిదా

News October 10, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (అక్టోబర్ 10, శుక్రవారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 4.56 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.08 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.03 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.20 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.58 గంటలకు
✒ ఇష: రాత్రి 7.10 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.