News October 9, 2025
7,267 ఉద్యోగాలు.. అప్లై చేశారా?

ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో 7,267 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. PGT, TGT, వార్డెన్(M, F), స్టాఫ్ నర్స్(F) తదితర పోస్టులున్నాయి. ఉద్యోగాలను బట్టి PG, B.Ed, డిగ్రీ, BSc నర్సింగ్, ఇంటర్, టెన్త్ పాసైన వారు అర్హులు. చివరి తేదీ OCT 23. వెబ్‌సైట్: https://nests.tribal.gov.in
* ప్రతిరోజూ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్ కేటగిరీ<<>>కి వెళ్లండి.
Similar News
News October 10, 2025
దేశంలో బురఖా బ్యాన్‌కు ప్లాన్ చేస్తున్న మెలోని!

ఇటలీలో ఇస్లామిక్ తీవ్రవాదం, వేర్పాటువాదం కట్టడికి ఆ దేశ PM మెలోని సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. బహిరంగ ప్రదేశాల్లో బురఖా, హిజాబ్, నిఖాబ్ ధరించడం, మసీదులకు ఫండింగ్‌ను బ్యాన్ చేయనున్నట్లు సమాచారం. రిలీజియస్ ఫ్రీడమ్ ఉండాలి కానీ, రాజ్యాంగానికి విరుద్ధంగా ఉండకూడదని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల పాలస్తీనాకు మద్దతుగా అక్కడ చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారడం తెలిసిందే.
News October 10, 2025
న్యూస్ అప్‌డేట్స్ @12am

*తెలంగాణ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు మధ్యంతర బెయిల్ రద్దు చేయాలని తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ. కీలకమైన సాక్ష్యాలు లభించాయన్న అడిషనల్ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా. విచారణ అక్టోబర్ 14కు వాయిదా.
*సుప్రీంకోర్టులో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరుల ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ నవంబర్ 3కు వాయిదా
News October 10, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (అక్టోబర్ 10, శుక్రవారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.56 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.08 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.03 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.20 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.58 గంటలకు
✒ ఇష: రాత్రి 7.10 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.