News April 7, 2024
వివాదంలో మంత్రి పొంగులేటి కుమారుడు!
TG: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడు హర్షారెడ్డి వివాదంలో చిక్కుకున్నారు. ఖరీదైన ఫిలిప్, బ్రిగెట్ బ్రాండ్ వాచ్‌లను ఆయన స్మగ్లర్ ముబిన్ ద్వారా తెప్పించినట్లు సమాచారం. ఒక్కో వాచ్ విలువ ₹1.75 కోట్లు ఉంటుందట. అతడిని చెన్నై కస్టమ్స్ అధికారులు ప్రశ్నించడంతో హర్షారెడ్డి పేరు బయటికి వచ్చింది. దీంతో APR 4న విచారణకు రావాలని ఆదేశించగా, తాను 27వ తేదీన హాజరవుతానని రిప్లై ఇచ్చినట్లు తెలుస్తోంది.
Similar News
News November 14, 2024
చంద్రబాబూ.. నీపై 420 కేసు ఎందుకు పెట్టకూడదు?: రజిని
AP: సూపర్ సిక్స్ హామీలిచ్చి ఎగ్గొట్టిన చంద్రబాబుపై 420 కేసు ఎందుకు పెట్టకూడదని మాజీ మంత్రి రజిని ప్రశ్నించారు. ‘ఆడబిడ్డ నిధి, దీపం, తల్లికి వందనం, అన్నదాత పథకాలకు ఎన్ని కోట్లు కేటాయించావ్? ఉచిత బస్సుకు అతీగతీలేదు. ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తావ్? రూ.4వేల పింఛన్ ఎంత మందికిచ్చావ్? ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తానంటున్నావ్? నాతో సహా మా పార్టీ కార్యకర్తలు నిలదీస్తూ కచ్చితంగా పోస్టులు పెడతారు’ అని తెలిపారు.
News November 14, 2024
ఎట్టకేలకు రిలయన్స్-డిస్నీ విలీనం పూర్తి
రిలయన్స్, డిస్నీ+హాట్‌స్టార్ విలీన ప్రక్రియ పూర్తైంది. ఈ సంస్థను జియో స్టార్‌గా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. ఈ కంపెనీకి ఛైర్‌పర్సన్‌గా నీతా అంబానీ, వైస్ ఛైర్‌పర్సన్‌గా ఉదయ్ శంకర్ వ్యవహరిస్తారు. రూ.70,353 కోట్లతో దేశంలోనే అతి పెద్ద మీడియా సామ్రాజ్యంగా నిలిచింది. ఈ కంపెనీలో రిలయన్స్ వాటా 63.16%, వాల్ట్ డిస్నీకి 36.84 % వాటా ఉంటుంది. ఈ రెండింటిలోని 100కు పైగా ఛానళ్లు ఒకే చోటకు రానున్నాయి.
News November 14, 2024
వారికి న్యాయ సహాయం చేస్తాం: వైసీపీ
AP: సోషల్ మీడియా కార్యకర్తలకు అండగా నిలిచేందుకు YCP కీలక నిర్ణయం తీసుకుంది. వారికి న్యాయ సహాయం అందించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. శ్రీకాకుళం-అప్పలరాజు, శ్యామ్ ప్రసాద్, తూర్పుగోదావరి-జక్కంపూడి రాజా, వంగా గీత, గుంటూరు-విడదల రజినీ, డైమండ్ బాబు, ప్రకాశం-TJR సుధాకర్, VRరెడ్డి, నెల్లూరు-R ప్రతాప్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, చిత్తూరు- గురుమూర్తి, మోహిత్ రెడ్డి, కడప-సురేశ్ బాబు, రమేశ్ యాదవ్.