News October 9, 2025

రేపు రాష్ట్ర బంద్‌కు తీన్మార్ మల్లన్న పిలుపు

image

TG: BC రిజర్వేషన్ల అంశంలో ప్రభుత్వం ఎటూ తేలని నిర్ణయాలు తీసుకుంటుందని తెలంగాణ రాజ్యాధికార పార్టీ చీఫ్ తీన్మార్ మల్లన్న ఆరోపించారు. తాజా పరిణామాలపై రేపు రాష్ట్ర బంద్‌కు పిలుపునిస్తున్నట్లు Way2Newsకు తెలిపారు. BC రిజర్వేషన్ల అంశంపై బాధ్యత వహిస్తూ CM రేవంత్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా BCలు నిరసన తెలుపాలని, కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేయాలని పిలుపునిచ్చారు.

Similar News

News October 10, 2025

కాబుల్‌పై పాకిస్థాన్ వైమానిక దాడులు?

image

అఫ్గానిస్థాన్ రాజధాని కాబుల్‌పై పాక్ వైమానిక దాడులు జరిపినట్లు తెలుస్తోంది. కాబుల్‌లో పేలుళ్లు సంభవించినట్లు వార్తలొస్తున్నాయి. తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్(TTP) ఉగ్రవాదులే లక్ష్యంగా ఈ దాడులు జరిగినట్లు సమాచారం. ఈ దాడుల్లో తాను మరణించినట్లు జరుగుతున్న ప్రచారాన్ని TTP చీఫ్ ముఫ్తీ నూర్ మెహ్సూద్ ఖండించారు. కాగా AFG ప్రభుత్వం TTP ఉగ్రవాద సంస్థకు మద్దతు ఇస్తోందని PAK రక్షణ మంత్రి ఇటీవల ఆరోపించారు.

News October 10, 2025

అక్టోబర్ 10: చరిత్రలో ఈ రోజు

image

1906: రచయిత R.K.నారాయణ్ జననం
1954: బాలీవుడ్ నటి రేఖ జననం
1967: హాస్య నటుడు ఆలీ జననం
1973: దర్శకుడు రాజమౌళి(ఫొటోలో)జననం
1990: హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ జననం
2022: సమాజ్‌వాది పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ మరణం
✶ ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం

News October 10, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.