News October 9, 2025
348 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ 348 GDS ఎగ్జిక్యూటివ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ అర్హతగల అభ్యర్థులు ఈ నెల 29 వరకు అప్లై చేసుకోవచ్చు. ఏపీలో 8, తెలంగాణలో 9 పోస్టులు ఉన్నాయి. అభ్యర్థుల వయసు 20 నుంచి 35ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.750. వెబ్‌సైట్: https://www.ippbonline.com/
Similar News
News October 10, 2025
కాబుల్‌పై పాకిస్థాన్ వైమానిక దాడులు?

అఫ్గానిస్థాన్ రాజధాని కాబుల్‌పై పాక్ వైమానిక దాడులు జరిపినట్లు తెలుస్తోంది. కాబుల్‌లో పేలుళ్లు సంభవించినట్లు వార్తలొస్తున్నాయి. తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్(TTP) ఉగ్రవాదులే లక్ష్యంగా ఈ దాడులు జరిగినట్లు సమాచారం. ఈ దాడుల్లో తాను మరణించినట్లు జరుగుతున్న ప్రచారాన్ని TTP చీఫ్ ముఫ్తీ నూర్ మెహ్సూద్ ఖండించారు. కాగా AFG ప్రభుత్వం TTP ఉగ్రవాద సంస్థకు మద్దతు ఇస్తోందని PAK రక్షణ మంత్రి ఇటీవల ఆరోపించారు.
News October 10, 2025
అక్టోబర్ 10: చరిత్రలో ఈ రోజు

1906: రచయిత R.K.నారాయణ్ జననం
1954: బాలీవుడ్ నటి రేఖ జననం
1967: హాస్య నటుడు ఆలీ జననం
1973: దర్శకుడు రాజమౌళి(ఫొటోలో)జననం
1990: హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ జననం
2022: సమాజ్‌వాది పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ మరణం
✶ ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం
News October 10, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.