News October 9, 2025
YCP హయాంలో ఉత్తరాంధ్రకు 4 మెడికల్ కాలేజీలు: జగన్

మాజీ సీఎం జగన్ నర్సీపట్నం మెడికల్ కాలేజీ ముందు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ.. 2019 వరకు ఉత్తరాంధ్రలో బ్రిటీష్ హయాంలో కట్టిన KGH, YSR హయాంలో తీసుకొచ్చిన రిమ్స్ మాత్రమే ఉండేవన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తరాంధ్రలో సుమారు 4 కాలేజీల ఏర్పాటుకు చర్యలు చేపట్టామన్నారు. ఇప్పటికే విజయనగరం, పాడేరు కాలేజీల్లో క్లాసులు కూడా స్టార్ట్ అయ్యాయన్నారు.
Similar News
News October 10, 2025
నిజాంసాగర్ ప్రాజెక్టు 5 గేట్ల నుంచి నీటి విడుదల

నిజాంసాగర్ ప్రాజెక్టుకు మళ్లీ వరద ఉద్ధృతి పెరిగింది. శుక్రవారం ఉదయం 41,680 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. దీంతో ప్రాజెక్టు 5 వరద గేట్లను ఎత్తి 40,680 క్యూసెక్కుల నీటిని మంజీరాకు విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు ఏఈఈ సాకేత్ తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 17.802 టీఎంసీలతో నిండుకుండలా మారింది. మరో వెయ్యి క్యూసెక్కుల నీటిని ప్రాజెక్టు ప్రధాన కాలువకు విడుదల కొనసాగుతోంది.
News October 10, 2025
ఇతిహాసాలు క్విజ్ – 31

1. విశ్వామిత్రుని ఆశ్రమం పేరేంటి?
2. బర్బరీకుడి తండ్రి ఎవరు?
3. పోతన తన ‘ఆంధ్ర మహాభాగవతం’ గ్రంథాన్ని ఎవరికి అంకితం ఇచ్చాడు?
4. కామ దేవుని వాహనం ఏది?
5. సంస్కృతంలో లక్ష(సంఖ్య)ను ఏమని అంటారు?
✍️ సరైన సమాధానాలను సాయంత్రం 6 గంటలకు పబ్లిష్ చేస్తాం.
<<-se>>#Ithihasaluquiz<<>>
News October 10, 2025
ఏలూరు: భార్యను కడతేర్చిన భర్త.!

అనుమానంతో భార్యను భర్త హతమార్చిన ఘటన గురువారం ఏలూరులో చోటు చేసుకుంది. శనివారపు పేట సమీపంలో నివసిస్తున్న కంతేటి నరేశ్ తాపీ పనులు చేస్తూ భార్య నాగలక్ష్మి (34) మిషన్ కుడుతూ జీవనోపాధి కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో భార్య వేరొకరితో మాట్లాడుతుందని అనుమానం పెంచుకొని కక్ష పెంచుకున్నాడు. దీంతో గురువారం కత్తెరతో దాడికి పాల్పడటంతో ఆసుపత్రికి తరలించే లోపు ఆమె మృతి చెందింది. 3 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.