News April 7, 2024
సుశాంత్ సింగ్ ఇంటిని నేను కొనలేదు: ఆదా శర్మ

ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఇంటిని తాను కొనుగోలు చేసినట్లు వస్తోన్న వార్తలను హీరోయిన్ ఆదా శర్మ ఖండించారు. ‘నేను ఆయన ఇంటిని కొనలేదు. కేవలం చూడటానికే అక్కడికి వెళ్లాను. సుశాంత్ గౌరవాన్ని కాపాడటం మనందరి బాధ్యత. ప్రస్తుతం నేను ప్రేక్షకుల గుండెల్లో ఉంటున్నా. అందుకు అద్దె చెల్లించాల్సిన అవసరం లేదు’ అని పేర్కొన్నారు.
Similar News
News September 14, 2025
కేజీ చికెన్ ధర రూ.280.. ఎక్కడంటే?

తెలుగు రాష్ట్రాల్లోని పలు చోట్ల చికెన్ ధరలు గత వారంతో పోలిస్తే స్వల్పంగా పెరిగాయి. TGలోని హైదరాబాద్, కామారెడ్డి, ఖమ్మంతో పాటు APలోని విజయవాడ, గుంటూరు, నంద్యాల, పల్నాడు, తూ.గో తదితర నగరాల్లో స్కిన్ లెస్ చికెన్ కేజీ రూ.230-240కి విక్రయిస్తున్నారు. అత్యధికంగా తిరుపతిలో రూ.280, అత్యల్పంగా కాకినాడలో రూ.220-230గా ఉంది. మీ ఏరియాలో రేట్ ఎంత? COMMENT
News September 14, 2025
గొర్రెల్లో చిటుక వ్యాధి ఎలా వస్తుంది?

గొర్రెలకు సోకే ప్రమాదకరమైన వ్యాధుల్లో ‘చిటుక వ్యాధి’ ఒకటి. ఈ వ్యాధి సోకిన గొర్రెలు త్వరగా మరణిస్తాయి. అందుకే దీన్ని ‘చిటుక వ్యాధి’ అని పిలుస్తారు. ఇది ‘క్లాస్ట్రీడియం పర్ఫింజన్స్ టైప్-డి’ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. వర్షాకాలంలో తేమతో కూడిన పచ్చగడ్డిని గొర్రెలు తిన్నప్పుడు చిటుక వ్యాధి సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వెటర్నరీ వైద్యులు చెబుతున్నారు.
News September 14, 2025
ఇవాళ అస్సాం, రేపు ప.బెంగాల్‌లో PM పర్యటన

PM మోదీ రాష్ట్రాల పర్యటనలు కొనసాగుతున్నాయి. ఇవాళ అస్సాంలో రూ.18,530 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. అస్సాం బయో-ఇథనాల్ ప్రైవేట్ లిమిటెడ్ రిఫైనరీ ప్లాంటును ప్రారంభిస్తారు. రేపు PM ప.బెంగాల్‌లో పర్యటిస్తారు. కోల్‌కతాలో జరిగే 16వ కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్-2025లో పాల్గొంటారు. ఆ తర్వాత బిహార్ వెళ్లి పూర్ణియా విమానాశ్రయం కొత్త టెర్మినల్‌ను ప్రారంభిస్తారు.