News October 9, 2025

లంచం అడిగిన వైద్యుడు.. విధుల నుంచి తొలగింపు

image

AP: మానసిక వైకల్యమున్న కుమార్తెకు సదరం సర్టిఫికెట్ కోసం ఆమె తండ్రిని లంచం అడిగిన డాక్టర్‌ని విధుల నుంచి తొలగించాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు. కడప GGHలోని ఆ డాక్టర్ ఏప్రిల్‌లో ₹10వేలు డిమాండ్ చేశాడు. ₹7వేలు ఇస్తానన్నా అంగీకరించలేదు. రెండ్రోజుల్లో ఇవ్వాల్సిందేనని గడువు పెట్టాడు. ఫిర్యాదు రాగా ఏసీబీ విచారణలో వాస్తవమేనని తేలింది. దీంతో సర్వీసు నుంచి అతణ్ని తొలగించాలని మంత్రి ఆదేశాలిచ్చారు.

Similar News

News October 10, 2025

మరో అల్పపీడనం.. భారీ నుంచి అతిభారీ వర్షాలు!

image

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరింత బలపడి ఈ నెల 11 నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో వచ్చే వారం తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కాగా నైరుతి రుతుపవనాలతో దేశంలో సాధారణ వర్షపాతం కంటే 8% అధికంగా నమోదైందని అధికారులు తెలిపారు.

News October 10, 2025

2,094 పోస్టులు.. అప్లై చేసుకోండి

image

నార్త్ వెస్ట్రర్న్ రైల్వే వివిధ రైల్వే డివిజన్లలో 2,094 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు NOV 2వరకు అప్లై చేసుకోవచ్చు. టెన్త్, ఐటీఐ వివిధ ట్రేడ్‌లలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల వయసు 15నుంచి 24ఏళ్ల మధ్య ఉండాలి. టెన్త్, ఐటీఐ మార్కులు, సర్టిఫికెట్ల వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.100. వెబ్‌సైట్: https://rrcjaipur.in/

News October 10, 2025

పొత్తుపై EPS వ్యాఖ్యలు.. ఖండించిన TVK

image

విజయ్ పార్టీ TVKతో పొత్తుపై AIADMK నేత E.పళనిస్వామి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. TNలో ఎన్డీయే కూటమి కోసం ఇప్పటికే పని ప్రారంభమైందని చెప్పారు. నమక్కల్ జిల్లాలో తన ప్రచారంలో కొందరు TVK జెండాలను ఊపడంపై ఆయన స్పందిస్తూ ‘చర్యలు మొదలయ్యాయి. ఇది విప్లవ ధ్వని. ఈ శబ్దాన్ని మీరు (DMK) తట్టుకోలేరు’ అని అన్నారు. పొత్తులు తప్పనిసరని, తమ కూటమి మరింత బలపడుతుందని చెప్పారు. అయితే పళని వ్యాఖ్యలను టీవీకే ఖండించింది.