News October 9, 2025
TRP ఉమ్మడి మహబూబ్‌నగర్ కన్వీనర్‌గా నవీన్ కుమార్

తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఉమ్మడి పది జిల్లాలకు సోషల్ మీడియా విభాగంలో కన్వీనర్లను నియమిస్తూ పార్టీ ప్రధాన నాయకత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో MBNR సోషల్ మీడియా కన్వీనర్‌గా నవీన్ కుమార్ నియమితులయ్యారు. ప్రజా సమస్యలపై జరుగుతున్న పోరాటాలను సోషల్ మీడియా వేదిక ద్వారా ప్రజలకు చేరవేయడంలో కన్వీనర్ల పాత్ర కీలకమని నాయకులు పేర్కొన్నారు.
Similar News
News October 10, 2025
విజయవాడ: దుర్గమ్మకు.. రెండు కోట్ల వజ్రాభరణాలు

రాబోయే వారం దుర్గమ్మకు ఒక ప్రముఖ వజ్రాభరణాల సంస్థ రూ. 2 కోట్లకు పైగా విలువైన ఆభరణాలను అందించనుంది. ఇందులో ముక్కుపుడక, మంగళసూత్రాలు వంటి వజ్రాభరణాలు ఉన్నాయి. ఈ ఆభరణాలను దేవస్థానంలో ఒక వేడుకగా అందజేయాలని సంస్థ ప్రతినిధులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా దుర్గగుడి అభివృద్ధి ప్రణాళికలు, ప్రధాన ఆలయానికి స్వర్ణ తాపడం వంటి అంశాలను అధికారులు వివరించనున్నారు.
News October 10, 2025
కడప: క్రికెటర్ కావాలని ఉందా?

క్రికెట్‌పై ఆసక్తి ఉన్నవారితో టాలెంట్ హట్ నిర్వహిస్తామని కడప జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎ.రెడ్డి ప్రసాద్ తెలిపారు. బాగా ప్రతిభ చూపిన వారిని ఎంపిక చేసి శిక్షణ ఇస్తామన్నారు. ఆసక్తి ఉన్నవారు తమ కిట్, ఆధార్ కార్డు, బర్త్, స్టడీ సర్టిఫికెట్, ఓ ఫొటోతో కడపలోని YSR ACA క్రికెట్ స్టేడియానికి రావాలని సూచించారు. 13న అండర్-12, 14న అండర్-14, 15న అండర్-16, 16న అండర్-19 క్రీడాకారులు రావాలి.
News October 10, 2025
జుట్టు విపరీతంగా రాలుతోందా?

ఒత్తయిన జుట్టును మహిళలందరూ కోరుకుంటారు. అయితే రక్త హీనత, డైటింగ్, థైరాయిడ్ సమస్యలు, కెమికల్ ప్రొడక్ట్స్, హెయిర్ స్ట్రెయిట్‌నర్‌ల వాడకం, గర్భధారణ సమయాల్లో విపరీతంగా జుట్టు ఊడిపోతుంది. దీని నివారణకు ఒమేగా-3, జింక్, ప్రొటీన్, ఐరన్ అధికంగా ఉండే ఫుడ్ తీసుకోవాలి. ఆయిల్‌తో మసాజ్ చేసుకుని గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలని నిపుణులు చెబుతున్నారు.
* మహిళల కంటెంట్ కోసం <<-se_10014>>వసుధ కేటగిరీ<<>>.