News October 9, 2025
వెండి ధరకు రెక్కలు.. ఒక్కరోజే రూ.7వేలు హైక్

HYD బులియన్ మార్కెట్‌లో కేజీ వెండి ధర ఇవాళ ఉదయం రూ.1,000, ఇప్పుడు మరో రూ.6వేలు పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.1,77,000కు చేరింది. కేవలం రెండు రోజుల్లోనే రూ.9,900 పెరగడం గమనార్హం. ఫ్యూచర్‌లో వెండి ధర ఊహించని విధంగా పెరుగుతుందని ట్రేడ్ నిపుణులు చెబుతుండటంతో ఇన్వెస్టర్లు సిల్వర్‌పై మొగ్గుచూపుతున్నారు. దీంతో భారీగా ధరలు పెరుగుతున్నాయి. ఇలానే కొనసాగితే నెలాఖరుకి రూ.2లక్షలకు చేరే ఛాన్స్ ఉంది.
Similar News
News October 10, 2025
పర్‌ఫెక్షనిస్ట్ పేరెంటింగ్‌తో ఇంపోస్టర్ సిండ్రోమ్

కెరీర్లో మంచి పొజిషన్‌లో ఉన్నా చాలామంది ఇంపోస్టర్ సిండ్రోమ్‌కు గురవుతున్నారు. తనను తాను తక్కువ చేసుకోవడం, ఆత్మన్యూనతకు గురవ్వడం, తన మాటకు విలువ ఉండదనే భావన ఇంపోస్టర్ సిండ్రోమ్ లక్షణాలు. అయితే దీనికి బీజాలు చిన్నప్పుడే పడతాయంటున్నారు నిపుణులు. తమ పిల్లలు అన్నిట్లో ముందుండాలని పేరెంట్స్ ఎప్పుడూ ఒత్తిడి చేస్తూ, వారిని తిడుతూ ఉంటే అది పెద్దయ్యాక ఇంపోస్టర్ సిండ్రోమ్‌కి దారితీస్తుందంటున్నారు నిపుణులు.
News October 10, 2025
న్యాయం చేయలేకపోతే రాజకీయాలు వదిలేస్తా: పవన్

AP: అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణలో రాజీపడే ప్రసక్తే లేదని Dy.CM పవన్ స్పష్టం చేశారు. కాకినాడ(D) ఉప్పాడలో ఫార్మా కంపెనీల వ్యర్థాల సమస్యపై మాట్లాడారు. ‘మిమ్మల్ని వంచించాలని ప్రయత్నించడం లేదు. మీకు న్యాయం చేయలేనప్పుడు రాజకీయాలు వదిలేసి వెళ్లిపోతా. అభిమానం కంటే పదవులు ఎక్కువ కాదు. సమస్య పరిష్కారానికి ప్లాన్ చేయాలంటే 100 రోజులు పడుతుంది. క్యాబినెట్‌లో మాట్లాడి న్యాయం చేస్తా’ అని హామీ ఇచ్చారు.
News October 10, 2025
మరో అల్పపీడనం.. భారీ నుంచి అతిభారీ వర్షాలు!

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరింత బలపడి ఈ నెల 11 నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో వచ్చే వారం తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కాగా నైరుతి రుతుపవనాలతో దేశంలో సాధారణ వర్షపాతం కంటే 8% అధికంగా నమోదైందని అధికారులు తెలిపారు.