News October 9, 2025

షాపుల యజమానులు అనుమతులు తీసుకోవాలి: ఎస్పీ

image

దీపావళి పండుగ పురస్కరించుకొని బాణసంచా తయారీ కేంద్రాలు, షాపులు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని ఎస్పీ విద్యాసాగర్ నాయుడు అన్నారు. గురువారం మచిలీపట్నంలో ఆయన మాట్లాడారు. ప్రజల భద్రత, శ్రేయస్సులో భాగంగా పోలీస్ వారికి సహకరించాలన్నారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా టపాసులు తయారు చేసినా, నిల్వ ఉంచిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తప్పవన్నారు.

Similar News

News October 10, 2025

ఉయ్యూరులో రూ. 12 లక్షలు టోకరా

image

తిరుమల ప్రత్యేక దర్శనం టికెట్లు ఇప్పిస్తానని నమ్మబలికి దామోదర్, ఆయన కుమారుడు యువ కళ్యాణ్ ఒకరి వద్ద రూ.12 లక్షలు కాజేశారు. ఉయ్యూరులో దామోదర్ ‘విజయ దుర్గ UPVC విండోస్ అండ్ డోర్స్’ పేరుతో షాపు నిర్వహిస్తున్నాడు. షాపుకు వచ్చిన ఓ కస్టమర్ తిరుమల వెళ్తున్నాడని తెలుసుకొని, తనకి అక్కడ పరిచయాలు ఉన్నాయని నమ్మించి ఈ మొత్తం వసూలు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News October 10, 2025

కృష్ణా : SC, ST అట్రాసిటీ కేసుల సత్వర పరిష్కారానికి చర్యలు

image

జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల సత్వర పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ మీటింగ్ హాలులో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా విజిలెన్స్ పర్యవేక్షణ కమిటీ సమావేశం జరిగింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెండింగ్ కేసుల వివరాలు, బాధితులకు తక్షణ పరిహారం అందించేందుకు తీసుకుంటున్న చర్యలపై ఆయన సమీక్షించారు.

News October 10, 2025

కృష్ణా: ఉపాధ్యాయుల పోరుబాట.. నేటి నుంచి బోధనేతర యాప్‌ల బహిష్కరణ

image

బోధనేతర పనులపై ఆగ్రహంతో ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయులు పోరుబాటకు సిద్ధమయ్యారు. బోధనేతర అంశాలకు సంబంధించిన యాప్ లను శుక్రవారం నుండి బహిష్కరిస్తున్నట్టు ఫ్యాప్టో ప్రకటించింది. సంఘ పిలుపు మేరకు గురువారం కలెక్టరేట్, జిల్లా విద్యాశాఖాధి ఆఫీసుల్లో వినతిపత్రాలు అందజేశారు. విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన పనులు మాత్రమే చేస్తామని ఫ్యాప్టో జిల్లా ఛైర్మన్ అంబటిపూడి సుబ్రహ్మణ్యం తెలిపారు.