News October 9, 2025

‘మేము రాము భర్కత్‌పురా PF ఆఫీస్‌కు’

image

భర్కత్‌పురా PF ఆఫీస్‌లో అర్జీదారుల కష్టాలు వర్ణణాతీతం. ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారు, స్థానికులు గంటల తరబడి లైన్లలో నిలబడాల్సి వస్తోందని, మరోసారి మేము రాము భర్కత్‌పుర PF ఆఫీస్‌కు అంటున్నారు. స్లిప్‌లు, సెక్షన్ మార్పులతో రోజంతా తిరగాల్సి వస్తోందని వాపోతున్నారు. ఒకేసారి వివరాలు చెప్పే PROని నియమించాలని కోరుతున్నారు. తాగడానికి మంచినీళ్లు లేవని, ఓపిక లేక బయటవచ్చి కూర్చున్నామని చెబుతున్నారు.

Similar News

News October 10, 2025

పటాన్‌చెరు: రూ.18 కోట్లు మోసం చేసిన ఘరానా లేడి

image

విద్య అనే ఓ ఘరానా లేడీ తోటి మహిళకు రూ.18 కోట్ల మేర మోసం చేసిన ఘటన పటాన్‌చెరులో వెలుగు చూసింది. సికింద్రాబాద్‌లోని వారణాసిగూడకు చెందిన విద్య.. బంగారం తీసుకుని ఎక్కువ సొమ్ము చెల్లిస్తానని మోసం చేసి పటాన్‌చెరుకు మకాం మార్చినట్లు పోలీసులు తెలిపారు. వెన్నెల అనే మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ వినాయక్ రెడ్డి వెల్లడించారు. మాయమాటలు చెప్పి భారీగా వసూలు చేసినట్లు బాధితులు తెలిపారు.

News October 10, 2025

ఎలక్ట్రానిక్స్ ఎగ్జిబిషన్ నిర్వహించండి: కలెక్టర్

image

ఏలూరు జిల్లాలో జీఎస్టీ 2.Oలో భాగంగా శుక్రవారం ఎలక్ట్రానిక్స్ ఎగ్జిబిషన్ కం సేల్ కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించాల్సిన కార్యక్రమాలపై కలెక్టరేట్ నుంచి గురువారం అధికారులతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. నిత్యావసర వస్తువులతోపాటు ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు కూడా భారీగా తగ్గాయన్నారు.

News October 10, 2025

ఒంగోలు: ఎయిర్‌పోర్ట్ పనులు ప్రారంభించాలని వినతి

image

సీఎం చంద్రబాబును ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కలిశారు. ప్రకాశం జిల్లాలో అభివృద్ధి పనులపై చర్చించారు. ఒంగోలు సమీపంలో ఎయిర్‌పోర్ట్ పనులు త్వరగా మొదలయ్యేలా చూడాలని కోరారు. ఒంగోలు పార్లమెంట్ పరిధిలో 39 రోడ్ల పునర్నిర్మాణానికి రూ.135 కోట్లు మంజూరు చేయాలని విన్నవించారు. ఒంగోలులో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడంపైనా సీఎంతో మాట్లాడారు. సీఎం సానుకూలంగా స్పందించారని ఎంపీ తెలిపారు.