News October 9, 2025
అనకాపల్లి: ‘తగ్గిన వైద్య పరికరాలు మందుల ధరలు’

జీఎస్టీ సంస్కరణలు అమల్లోకి వచ్చిన నేపథ్యంలో వైద్య పరికరాలు, మందుల ధరలు తగ్గినట్లు DMHO డాక్టర్ హైమావతి తెలిపారు. గురువారం అనకాపల్లి DMHO కార్యాలయంలో వైద్యాధికారులు, సిబ్బందితో జీఎస్టీ సూపర్ సేవింగ్స్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. జీఎస్టీ తగ్గడంతో వైద్య ఖర్చుల్లో ప్రజలకు ఆదా అతుందన్నారు. దీనిపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు.
Similar News
News October 10, 2025
గాంధారి: చెరువులో పడి మహిళ మృతి

గాంధారి మండలం పెద్ద పొతంగల్‌కు చెందిన దుర్కి సాయవ్వ(40) గిద్దల చెరువులో పడి మృతి చెందింది. గ్రామస్థుల కథనం ప్రకారం.. గ్రామంలో ఆమె ఒంటరిగా జీవిస్తోంది. గురువారం ఉదయం కాలకృత్యాలు వెళ్లి కాలుజారి చెరువులో పడి మృతి చెందింది. దీంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆమె కూతురు సౌందర్య ఫిర్యాదు మేరకు ఎస్సై ఆంజనేయులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News October 10, 2025
VKB: అడవి పందులను తప్పించబోయి.. వ్యక్తి దుర్మరణం

అడవి పందులను తప్పించే ప్రయత్నంలో బైక్ అదుపుతప్పి జుంటిపల్లికి చెందిన రాంచందర్(46) మృతి చెందారు. ఎస్సై విఠల్ రెడ్డి ప్రకారం.. రాంచందర్ తాండూరు నుంచి వస్తుండగా కోకట్ బైపాస్ వద్ద అడవి పందుల గుంపు అడ్డు వచ్చింది. వాటిని తప్పించే క్రమంలో బైక్ అదుపు తప్పి కిందపడి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News October 10, 2025
KNR: ఎన్నికలు రద్దు.. ‘నామినేషన్ FEE’ సంగతేంటి..?

స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ నిన్న విడుదలైంది. దీంతో ఉమ్మడి KNRలో ప్రక్రియ మొదలైంది. KNRలో 1 ZPTC, 2 MPTC, JGTLలో 2 MPTC, SRCLలో 2 ZPTC, PDPLలో 1 MPTCకి నామినేషన్లొచ్చాయి. ZPTC GEN అభ్యర్థులకు రూ.5000, BC, SC, STలకు 2500, GEN MPTC అభ్యర్థులకు 2500, BC, SC, STలకు 1250లు పత్రాలతో డిపాజిట్ చేయాల్సుంటుంది. కాగా ఎన్నికల రద్దుతో అభ్యర్థులు రుసుం రిఫండ్ అడుగుతున్నారు. దీనిపై EC నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.