News October 9, 2025

ఏసీబీకి చిక్కిన చిట్యాల ఎమ్మార్వో

image

చిట్యాల తహశీల్దార్ కృష్ణ ఏసీబీకి చిక్కారు. భూమికి సంబంధించిన ధ్రువపత్రాల కోసం ఓ వ్యక్తి నుంచి రూ.2 లక్షల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. గతంలోనూ ఆయనపై అవినీతి ఆరోపణలు ఉన్నట్లు ఏసీబీ వర్గాలు తెలిపాయి. అధికారులు ఆయన నివాసంలో ఆస్తుల తనిఖీలు నిర్వహిస్తున్నారు.

Similar News

News October 10, 2025

నెల్లూరు: అద్దె బకాయిలు దారి మల్లించారా?

image

నెల్లూరు చిన్నబజారులోని NMC కి చెందిన పలు షాపులు వారు అద్దెలు చెల్లించలేదు. దీంతో గురువారం NMC రెవెన్యూ అధికారి సమద్ ఆధ్వర్యంలో వాటిని సీజ్ చేశారు. వీటిల్లో 2 షాప్‌కు రూ.1 లక్ష, 11 నెంబర్ షాప్‌కు రూ. 6.57లక్షలు, 22 షాప్‌కు రూ. 72 వేలు , 30 షాప్‌కు రూ. 15 లక్షలు చొప్పున అద్దెలు చెల్లించాల్సి ఉంది. అద్దెలు చెల్లించకుండా ఉండడం వెనుక కార్యాలయంలోని పలువురు చక్రం తిప్పినట్లు విమర్శలొస్తున్నాయి.

News October 10, 2025

విజయవాడలో స్మార్ట్ వెండింగ్ మార్కెట్

image

VJA విద్యాధరపురం RTC డిపో సమీపంలో మెప్మా ఆధ్వర్యంలో స్మార్ట్ వెండింగ్ మార్కెట్ తరహా ఫుడ్ కోర్టులను ఏర్పాటు చేయనున్నారు. ఈ తరహా మార్కెట్‌ను ఇప్పటికే నెల్లూరులో ఏర్పాటు చేశారు. పొదుపు మహిళలకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి, ఫుడ్ కోర్టులు, ఇతర వ్యాపారాలు చేసుకునేందుకు మెప్మా అధికారులు చర్యలు చేపట్టనున్నారు. తొలి విడతలో 40 దుకాణాల ఏర్పాటుకు అనుమతులు కోరినట్లు మెప్మా అధికారులు తెలిపారు.

News October 10, 2025

వరంగల్: గంజి, గటకే వారి కడుపునింపింది!

image

‘ఏళ్ల తరబడి కూడుకేడ్చాం.. గూడుకేడ్చాం.. గుడ్డకేడ్చాం’ అనే ఓ సినామాలోని డైలాగ్ మీకు గుర్తుండే ఉంటుంది. ఈ క్రమంలోనే ఎనకటి రోజుల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని లక్షలమంది తినడానికి తిండిలేక అనేక అవస్థలు పడ్డారు. గటక, గంజి తాగి ఏళ్ల తరబడి బతికారు. పండగ రోజు మాత్రమే అన్నం తినేవారు. మిగతా రోజుల్లో గంజి మాత్రమే వారి ఆహారం. అందులోని పోషకాలతో నేటికీ ఆరోగ్యంగా ఉండటం విశేషం. నేడు ప్రపంచ గంజి దినోత్సవం. SHARE IT.