News October 9, 2025
పల్నాడు: సచివాలయ ఉద్యోగినిపై అత్యాచార యత్నం: ఎస్ఐ

ఎడ్లపాడు (M)కారుచోల సచివాలయంలో పనిచేసే ఓ ఉద్యోగినిపై అదే గ్రామానికి చెందిన తిరుపతయ్య అత్యాచారయత్నానికి పాల్పడ్డాడని PSలో కేసు నమోదైంది. SI శివరామకృష్ణ వివరాల మేరకు..తిరుపతయ్య తన దూడ ఆరోగ్యం బాగోలేదని చెప్పి, ఉద్యోగినిని తన ఇంటికి పిలిపించాడు. దూడను చూస్తున్న సమయంలో తిరుపతయ్య బలవంగా ఆమె చేయి పట్టుకుని లాగాడు. మహిళ కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి వచ్చి పోలీసులకు సమాచారం అందించారు.
Similar News
News October 10, 2025
విజయ్ హజారే ట్రోఫీలో ఆడనున్న రోహిత్, కోహ్లీ!

స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ విజయ్ హజారే ట్రోఫీలో ఆడాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం. 2027 ODI వరల్డ్‌కప్ వాళ్ల లక్ష్యమైతే అందులో 3-4 మ్యాచులు ఆడాలని చెప్పినట్లు తెలుస్తోంది. నవంబర్‌లో సౌతాఫ్రికా, జనవరిలో న్యూజిలాండ్‌తో సిరీస్‌లు ఉన్నాయి. మధ్యలో విజయ్ హజారే ట్రోఫీ జరుగుతుంది. సెంట్రల్ కాంట్రాక్ట్ ప్లేయర్లు దేశవాళీలో ఆడాలని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ చెప్పడం తెలిసిందే.
News October 10, 2025
GNT: గంటలో ‘సీఎంను చంపుతా’ అంటూ కాల్

సీఎంని గంటలో చంపుతానంటూ మంగళగిరి రత్నాలచెరువు ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి గురువారం డయల్ 100కు ఫోన్ చేయడంతో పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. ఈ సమాచారంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు, సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. బెదిరింపు కాల్ చేసిన వ్యక్తి అదుపులోకి తీసుకునే సమయానికి విపరీతమైన మద్యం మత్తులో ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
News October 10, 2025
ADB: తండ్రి మరణ వార్త విని కుమారుడి ఆత్మహత్యాయత్నం

తండ్రి సూసైడ్ చేసుకోవడంతో కుమారుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ADB జిల్లాలో జరిగింది. బజార్హత్నూర్ మం. వర్తమన్నూర్‌కు చెందిన విజయ్‌కుమార్ పాఠశాలకు వెళ్తున్నానని చెప్పి శ్రీరాంకాలనీలోని ఇంట్లో ఉరేసుకున్నాడు. దీంతో చిన్నకుమారుడు బస్సులో వస్తూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు అతడిని రిమ్స్‌కు తరలించారు. కడుపు నొప్పి భరించలేక ఉరేసుకున్నట్లు కుటుంబీకులు ఫిర్యాదు చేశారని మావల SI తెలిపారు.