News October 9, 2025
సైబర్ మోసాలపై HYD సైబర్ క్రైమ్ పోలీసుల సూచన

ఆన్‌లైన్ ట్రేడింగ్ మోసాలపై సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా నకిలీ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్లు ప్రజలను మోసం చేస్తున్నారని వెల్లడించారు. చిన్న ఇన్వెస్ట్‌మెంట్‌తో మొదలై పెద్ద మొత్తంలో డబ్బులు దోచుకుంటున్నారని తెలిపారు. నకిలీ వెబ్‌సైట్లలో ఫేక్ లాభాలు చూపించి, ట్యాక్స్‌లు, ఫీజుల పేరుతో మరిన్ని డబ్బులు వసూలు చేస్తున్నారని హెచ్చరిస్తున్నారు. 1930, వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయండి.
Similar News
News October 10, 2025
బతుకునిచ్చిన హైదరాబాద్!

HYD.. లక్షలాది మందికి ఉపాధినిస్తోన్న నగరం. అందుకే తెలంగాణ ప్రజలకు సిటీ ఓ ఎమోషన్. గరీబ్ నుంచి అమీర్ వరకు ఇక్కడ అన్ని సదుపాయాలు ఉంటాయి. నగరం గురించి గొప్పగా చెప్పుకోవడంలో ఒక్కొక్కరు ఒక్కోలా అభివర్ణిస్తుంటారు. తాజాగా SMలో ఓ ఫొటో వైరల్ అవుతోంది. ‘బ్రతకమే వేస్ట్ అనుకున్న నాకు హైదరాబాద్ ఎలా బ్రతకాలో నేర్పింది’ అంటూ ఓ ఆటోవాలా తన ఆటో వెనుక కొటేషన్ రాయించాడు. మరి HYD మీకు ఏం నేర్పింది? కామెంట్ చేయండి.
News October 10, 2025
HYD: ఇది కదా..! నిజమైన దేశభక్తి

మన నగరంలోని వీధులు, రోడ్లు చెత్త కాగితాలతో అపరిశుభ్రంగా కనిపిస్తుంటాయి. ఒకవైపు కేంద్రం స్వచ్ఛభారత్ తెచ్చినా క్షేత్రస్థాయిలో నీరుగారిపోతోంది. ఎవరికి తోచినట్లు వారు కనీస బాధ్యతను మరిచి ప్రవర్తిస్తుంటారు. కానీ ఫిలింనగర్‌లో ఈ విద్యార్థి చదువు నేర్పిన బుద్ధితోనేమో తాను ఉపయోగించిన కవర్లను రోడ్డు పక్కన ఉన్న డస్ట్‌బిన్లలో వేస్తూ కనిపించాడు. ‘ఇది కదా నిజమైన దేశభక్తి అంటే’ అని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.
News October 10, 2025
HYD: రూ.18 కోట్లు మోసం చేసిన ఘరానా లేడి

విద్య అనే ఓ ఘరానా లేడీ తోటి మహిళకు రూ.18 కోట్ల మేర మోసం చేసిన ఘటన పటాన్‌చెరులో వెలుగు చూసింది. సికింద్రాబాద్‌లోని వారణాసిగూడకు చెందిన విద్య.. బంగారం తీసుకుని ఎక్కువ సొమ్ము చెల్లిస్తానని మోసం చేసి పటాన్‌చెరుకు మకాం మార్చినట్లు పోలీసులు తెలిపారు. వెన్నెల అనే మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ వినాయక్ రెడ్డి వెల్లడించారు. మాయమాటలు చెప్పి భారీగా వసూలు చేసినట్లు బాధితులు తెలిపారు.