News October 9, 2025

అలంపూర్: తుంగభద్ర నదిలో ఎన్డీఆర్ఎఫ్‌ మాక్ డ్రిల్

image

ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలను రక్షించేందుకు గురువారం తుంగభద్ర నదిలో ఎన్డీఆర్ఎఫ్, డీడీఆర్ఎఫ్ బృందాల ద్వారా మాక్ డ్రిల్ (Mock Drill) నిర్వహించారు. ​పోలీస్ శాఖ ఆదేశాల మేరకు అలంపూర్ సీఐ రవిబాబు ఆధ్వర్యంలో సుమారు 2 గంటల పాటు ఈ శిక్షణ జరిగింది. స్పెషల్ బోట్ల సహాయంతో వరద నీటిలో ప్రాణాలను ఎలా కాపాడాలో రెస్క్యూ టీమ్‌లు కళ్లకు కట్టినట్టు చూపించారు. విపత్తులు ఎదురైనప్పుడు స్వయంగా రక్షించుకోవాలన్నారు.

Similar News

News October 10, 2025

NZB: సీఎ రేవంత్ రెడ్డి షెడ్యూల్ ఇదే

image

నిజామాబాద్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం రానున్న సంగతి తెలిసిందే. ఆయన పర్యటన షెడ్యూల్ ఇలా ఉంది. ఉదయం 11.45కు బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 12.30కు NZB కలెక్టరేట్ చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బోర్గాం చేరుకుని రూరల్ MLA భూపతి రెడ్డి మాతృమూర్తి దినకర్మకు హాజరవుతారు. అక్కడ నుంచి మధ్యాహ్నం ఒంటి గంటకు బయలుదేరి కలెక్టరేట్ నుంచి HYD వెళ్తారు.

News October 10, 2025

సంగారెడ్డి: నేడు ఉమ్మడి జిల్లా ఫుట్ బాల్ పోటీలు

image

ఉమ్మడి మెదక్ జిల్లా అండర్-17 ఫుట్ బాల్ పోటీలు మెదక్‌లోని వెస్లీ కళాశాలలో శుక్రవారం నిర్వహిస్తున్నట్లు స్కూల్ గేమ్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసరావు తెలిపారు. బోనాఫైడ్, జనన ధ్రువీకరణ పత్రంతో ఉదయం 9 గంటలకు హాజరుకావాలని చెప్పారు. ప్రతిభ చూపిన విద్యార్థులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తారని పేర్కొన్నారు.

News October 10, 2025

నెల్లూరు: అద్దె బకాయిలు దారి మల్లించారా?

image

నెల్లూరు చిన్నబజారులోని NMC కి చెందిన పలు షాపులు వారు అద్దెలు చెల్లించలేదు. దీంతో గురువారం NMC రెవెన్యూ అధికారి సమద్ ఆధ్వర్యంలో వాటిని సీజ్ చేశారు. వీటిల్లో 2 షాప్‌కు రూ.1 లక్ష, 11 నెంబర్ షాప్‌కు రూ. 6.57లక్షలు, 22 షాప్‌కు రూ. 72 వేలు , 30 షాప్‌కు రూ. 15 లక్షలు చొప్పున అద్దెలు చెల్లించాల్సి ఉంది. అద్దెలు చెల్లించకుండా ఉండడం వెనుక కార్యాలయంలోని పలువురు చక్రం తిప్పినట్లు విమర్శలొస్తున్నాయి.