News October 9, 2025

వనపర్తి: స్టేతో ఒకవైపు ఖేదం.. మరోవైపు మోదం..!

image

బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌తోపాటు నోటిఫికేషన్ పై కూడా హైకోర్టు స్టే విధించడంతో గ్రామాల నేతల్లో ఆనందం, ఆవేదన కనిపిస్తోందని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుత రిజర్వేషన్ల ప్రకారం పోటీకి నామినేషన్లకు సిద్ధమైన వారు ఆవేదన చెందుతుండగా, రిజర్వేషన్ కారణంగా పోటీకి అవకాశాలు కోల్పోయిన వారు స్టేతో ఆనందం వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు. జిల్లాలో స్టేతో 133 ఎంపీటీసీ, 15 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు ఆగాయి.

Similar News

News October 10, 2025

NZB: సీఎ రేవంత్ రెడ్డి షెడ్యూల్ ఇదే

image

నిజామాబాద్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం రానున్న సంగతి తెలిసిందే. ఆయన పర్యటన షెడ్యూల్ ఇలా ఉంది. ఉదయం 11.45కు బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 12.30కు NZB కలెక్టరేట్ చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బోర్గాం చేరుకుని రూరల్ MLA భూపతి రెడ్డి మాతృమూర్తి దినకర్మకు హాజరవుతారు. అక్కడ నుంచి మధ్యాహ్నం ఒంటి గంటకు బయలుదేరి కలెక్టరేట్ నుంచి HYD వెళ్తారు.

News October 10, 2025

సంగారెడ్డి: నేడు ఉమ్మడి జిల్లా ఫుట్ బాల్ పోటీలు

image

ఉమ్మడి మెదక్ జిల్లా అండర్-17 ఫుట్ బాల్ పోటీలు మెదక్‌లోని వెస్లీ కళాశాలలో శుక్రవారం నిర్వహిస్తున్నట్లు స్కూల్ గేమ్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసరావు తెలిపారు. బోనాఫైడ్, జనన ధ్రువీకరణ పత్రంతో ఉదయం 9 గంటలకు హాజరుకావాలని చెప్పారు. ప్రతిభ చూపిన విద్యార్థులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తారని పేర్కొన్నారు.

News October 10, 2025

నెల్లూరు: అద్దె బకాయిలు దారి మల్లించారా?

image

నెల్లూరు చిన్నబజారులోని NMC కి చెందిన పలు షాపులు వారు అద్దెలు చెల్లించలేదు. దీంతో గురువారం NMC రెవెన్యూ అధికారి సమద్ ఆధ్వర్యంలో వాటిని సీజ్ చేశారు. వీటిల్లో 2 షాప్‌కు రూ.1 లక్ష, 11 నెంబర్ షాప్‌కు రూ. 6.57లక్షలు, 22 షాప్‌కు రూ. 72 వేలు , 30 షాప్‌కు రూ. 15 లక్షలు చొప్పున అద్దెలు చెల్లించాల్సి ఉంది. అద్దెలు చెల్లించకుండా ఉండడం వెనుక కార్యాలయంలోని పలువురు చక్రం తిప్పినట్లు విమర్శలొస్తున్నాయి.