News October 9, 2025
పారామెడికల్ కోర్సులకు దరఖాస్తు చేసుకోండి: ప్రిన్సిపల్

పారామెడికల్ కోర్సులకు భూపాలపల్లి జిల్లా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు తెలిపారు. డీఎంఎల్టీ, డీఈసీజీలో 30 సీట్ల చొప్పున ఈ నెల 28వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రింట్ కాపీని ₹100 రుసుముతో కళాశాలలో సమర్పించాలని ఆయన పేర్కొన్నారు.
Similar News
News October 10, 2025
NZB: సీఎ రేవంత్ రెడ్డి షెడ్యూల్ ఇదే

నిజామాబాద్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం రానున్న సంగతి తెలిసిందే. ఆయన పర్యటన షెడ్యూల్ ఇలా ఉంది. ఉదయం 11.45కు బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 12.30కు NZB కలెక్టరేట్ చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బోర్గాం చేరుకుని రూరల్ MLA భూపతి రెడ్డి మాతృమూర్తి దినకర్మకు హాజరవుతారు. అక్కడ నుంచి మధ్యాహ్నం ఒంటి గంటకు బయలుదేరి కలెక్టరేట్ నుంచి HYD వెళ్తారు.
News October 10, 2025
సంగారెడ్డి: నేడు ఉమ్మడి జిల్లా ఫుట్ బాల్ పోటీలు

ఉమ్మడి మెదక్ జిల్లా అండర్-17 ఫుట్ బాల్ పోటీలు మెదక్‌లోని వెస్లీ కళాశాలలో శుక్రవారం నిర్వహిస్తున్నట్లు స్కూల్ గేమ్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసరావు తెలిపారు. బోనాఫైడ్, జనన ధ్రువీకరణ పత్రంతో ఉదయం 9 గంటలకు హాజరుకావాలని చెప్పారు. ప్రతిభ చూపిన విద్యార్థులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తారని పేర్కొన్నారు.
News October 10, 2025
నెల్లూరు: అద్దె బకాయిలు దారి మల్లించారా?

నెల్లూరు చిన్నబజారులోని NMC కి చెందిన పలు షాపులు వారు అద్దెలు చెల్లించలేదు. దీంతో గురువారం NMC రెవెన్యూ అధికారి సమద్ ఆధ్వర్యంలో వాటిని సీజ్ చేశారు. వీటిల్లో 2 షాప్‌కు రూ.1 లక్ష, 11 నెంబర్ షాప్‌కు రూ. 6.57లక్షలు, 22 షాప్‌కు రూ. 72 వేలు , 30 షాప్‌కు రూ. 15 లక్షలు చొప్పున అద్దెలు చెల్లించాల్సి ఉంది. అద్దెలు చెల్లించకుండా ఉండడం వెనుక కార్యాలయంలోని పలువురు చక్రం తిప్పినట్లు విమర్శలొస్తున్నాయి.