News October 9, 2025

TTDకి టోకరా వేయబోయి… చివరకు CBIకి చిక్కి

image

PMO Dy.Sec అంటూ మోసాలు చేస్తున్న వ్యక్తి తిరుమల బాలాజీ సాక్షిగా దొరికాడు. మే10న రామారావు అనే వ్యక్తి PMO అధికారినని 10 సుప్రభాత టికెట్లు, 3AC రూములు కావాలని TTD EOకు లేఖ ఇచ్చారు. అనుమానంతో అధికారులు PMOలో ఆరా తీయగా అలాంటి వ్యక్తి లేరని చెప్పారు. ఆపై PMO AD శర్మ CBIకి ఫిర్యాదు చేశారు. తాజాగా కేసు విచారణలో అతడు ఇదివరకూ పీఎంఓ JSనంటూ పుణే వర్సిటీలో అడ్మిషన్, మైసూరులో భూమి పత్రాలను పొందాడని తేలింది.

Similar News

News October 10, 2025

లివ్-ఇన్ రిలేషన్‌షిప్ వద్దు.. 50 ముక్కలవుతారు: గవర్నర్

image

నేటి తరం అమ్మాయిలు లివ్-ఇన్ రిలేషన్‌షిప్ (సహజీవనం)కు దూరంగా ఉండాలని ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్ ఆనందిబెన్ పటేల్ పిలుపునిచ్చారు. ‘లివ్-ఇన్ రిలేషన్‌షిప్స్ ఈ రోజుల్లో ట్రెండ్‌గా మారింది. 15-20 ఏళ్ల యువతులు బిడ్డలను కంటున్నారు. మన ఆడబిడ్డలు ఇలా చేయడం బాధగా ఉంది. సహజీవనానికి దూరంగా ఉండండి. లేకపోతే మీరు 50 ముక్కలై దొరుకుతారు. వాటికి దూరంగా ఉండాలి’ అని వారణాసిలో స్నాతకోత్సవ సభలో హెచ్చరించారు.

News October 10, 2025

జుట్టు విపరీతంగా రాలుతోందా?

image

ఒత్తయిన జుట్టును మహిళలందరూ కోరుకుంటారు. అయితే రక్త హీనత, డైటింగ్, థైరాయిడ్ సమస్యలు, కెమికల్ ప్రొడక్ట్స్, హెయిర్ స్ట్రెయిట్‌నర్‌ల వాడకం, గర్భధారణ సమయాల్లో విపరీతంగా జుట్టు ఊడిపోతుంది. దీని నివారణకు ఒమేగా-3, జింక్, ప్రొటీన్, ఐరన్ అధికంగా ఉండే ఫుడ్ తీసుకోవాలి. ఆయిల్‌తో మసాజ్ చేసుకుని గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలని నిపుణులు చెబుతున్నారు.
* మహిళల కంటెంట్ కోసం <<-se_10014>>వసుధ కేటగిరీ<<>>.

News October 10, 2025

CSIR-IMMTలో 10 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

CSIR-IMMTలో 10 ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి BE, బీటెక్, MSc(బయోటెక్నాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయో కెమిస్ట్రీ, జువాలజీ, మైక్రో బయాలజీ), BSc, PhD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఈ నెల 23న ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. వెబ్‌సైట్: https://rects.immt.res.in/