News October 9, 2025

ఆరోగ్య సేవల ఖర్చు తగ్గుతుంది: మంత్రి సవిత

image

గోరంట్ల ఏరియా హాస్పిటల్‌లో సూపర్ GST సూపర్ సేవింగ్స్ పై గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సవిత, కలెక్టర్ శ్యాం ప్రసాద్ పాల్గొన్నారు. వైద్య పరికరాలపై జీఎస్టీ రేట్లు గణనీయంగా తగ్గించడంపై ప్రజలకు, వైద్య సిబ్బందికి అవగాహన కల్పించారు. కేంద్ర ప్రభుత్వం వైద్య రంగంలో వినియోగించే పరికరాలపై జీఎస్టీని 18% నుంచి 5% తగ్గించడంతో ఆరోగ్య సేవల ఖర్చు తగ్గిందని మంత్రి తెలిపారు.

Similar News

News October 10, 2025

బూర్జ: ప్రేమ పేరుతో మోసం.. యువకుడిపై కేసు నమోదు

image

ప్రేమ పేరుతో మోసం చేసిన ఓ యువకుడుపై బూర్జ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ ఎం.ప్రవల్లిక వివరాలు మేరకు.. బూర్జ మండలం ఓ గ్రామానికి చెందిన యువకుడు అదే గ్రామానికి చెందిన ఒక బాలికను ప్రేమ పేరుతో మోసం చేశాడు. పెళ్లికి నిరకరించడంతో సదరు బాలిక ఫిర్యాదు మేరకు గురువారం ఆ యువకుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.

News October 10, 2025

SRSP: 24 గంటల్లో 74,502 క్యూసెక్కుల ఇన్ ఫ్లో

image

గడిచిన 24 గంటల్లో SRSPలోకి ఎగువ ప్రాంతాల నుంచి 74,502 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చినట్లు అధికారులు తెలిపారు. అంతే మొత్తంలో నీటిని దిగువకు వదిలినట్లు ప్రాజెక్టు అధికారులు చెప్పారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు 75,394 క్యూసెక్కుల ఇన్ ఫ్లోగా వస్తుండగా 21 గేట్ల ద్వారా 65,604 క్యూసెక్కులు వదులుతున్నట్లు పేర్కొన్నారు. ప్రాజెక్టులో తాజాగా 80.053 TMCల నీరు నిల్వ ఉందని అధికారులు వెల్లడించారు.

News October 10, 2025

BJP-RSS సమాజాన్ని విషపూరితం చేస్తున్నాయి: రాహుల్

image

హరియాణాలో IPS ఆఫీసర్ పూరన్ కుమార్ ఆత్మహత్యపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ BJP-RSSను విమర్శించారు. ‘కులం పేరుతో మానవత్వాన్ని అణచివేస్తున్న సోషల్ పాయిజన్‌కు ఇది నిదర్శనం. కులం పేరిట IPS అధికారి అవమానానికి గురైతే ఇక సాధారణ దళితుడి పరిస్థితేంటి? బలహీనవర్గాలకు జరుగుతున్న అన్యాయానికి ఇది అద్దం పడుతోంది. BJP-RSSల విద్వేషం, మనువాద మనస్తత్వం సమాజాన్ని విషపూరితం చేస్తున్నాయి’ అని ఆరోపించారు.