News October 9, 2025
ములుగు: పోక్సో కేసులో ఒకరికి జీవిత ఖైదు

పొక్సో కేసులో ఒకరికి జీవిత కైదు విధించినట్లు ములుగు ఎస్పీ శబరీశ్ తెలిపారు. ఎస్పీ తెలిపిన వివరాలు.. ఏటూరునాగారానికి చెందిన నిందితుడు మంతెన రామయ్యపై నమోదు చేసిన పొక్సో కేసు నేరం నిరూపితమైంది. ఈ మేరకు కోర్టు జీవిత ఖైదు, 20 ఏళ్ల కఠిన కారాగార జైలు శిక్షతోపాటు రూ.12 వేల జరిమానా విధించింది. అదే విధంగా బాధితురాలికి రూ.10 లక్షల నష్టపరిహారం అందించాలని కోర్టు తీర్పు ఇచ్చినట్లు ఎస్పీ పేర్కొన్నారు.
Similar News
News October 10, 2025
SRSP: 24 గంటల్లో 74,502 క్యూసెక్కుల ఇన్ ఫ్లో

గడిచిన 24 గంటల్లో SRSPలోకి ఎగువ ప్రాంతాల నుంచి 74,502 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చినట్లు అధికారులు తెలిపారు. అంతే మొత్తంలో నీటిని దిగువకు వదిలినట్లు ప్రాజెక్టు అధికారులు చెప్పారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు 75,394 క్యూసెక్కుల ఇన్ ఫ్లోగా వస్తుండగా 21 గేట్ల ద్వారా 65,604 క్యూసెక్కులు వదులుతున్నట్లు పేర్కొన్నారు. ప్రాజెక్టులో తాజాగా 80.053 TMCల నీరు నిల్వ ఉందని అధికారులు వెల్లడించారు.
News October 10, 2025
BJP-RSS సమాజాన్ని విషపూరితం చేస్తున్నాయి: రాహుల్

హరియాణాలో IPS ఆఫీసర్ పూరన్ కుమార్ ఆత్మహత్యపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ BJP-RSSను విమర్శించారు. ‘కులం పేరుతో మానవత్వాన్ని అణచివేస్తున్న సోషల్ పాయిజన్‌కు ఇది నిదర్శనం. కులం పేరిట IPS అధికారి అవమానానికి గురైతే ఇక సాధారణ దళితుడి పరిస్థితేంటి? బలహీనవర్గాలకు జరుగుతున్న అన్యాయానికి ఇది అద్దం పడుతోంది. BJP-RSSల విద్వేషం, మనువాద మనస్తత్వం సమాజాన్ని విషపూరితం చేస్తున్నాయి’ అని ఆరోపించారు.
News October 10, 2025
ఎన్టీఆర్: ఉద్యోగాల కల్పనపై మంత్రి కీలక ప్రకటన

మైనారిటీ యువతకు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సౌజన్యంతో ఖతార్‌లో హోమ్ కేర్ నర్స్ ఉద్యోగాలు కల్పిస్తున్నామని మంత్రి NMD ఫరూక్ తెలిపారు. ఈ నెల 13న విజయవాడ ప్రభుత్వ ITI కళాశాలలో ఈ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని, ఎంపికైనవారికి నెలకు రూ.1.20 లక్షల వేతనం లభిస్తుందన్నారు. 21- 40 ఏళ్లలోపు వయస్సు ఉండి బీఎస్సీ, GNM నర్సింగ్ పూర్తి చేసిన అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరు కావాలన్నారు.