News October 9, 2025

తొర్రూరు డిపోకు భారీ ఆదాయం

image

బతుకమ్మ, దసరా పండగల సందర్భంగా రద్దీకి అనుగుణంగా బస్సులు నడపడంతో ఆర్టీసీకి మంచి ఆదాయం సమకూరింది. 494 ట్రిప్పులు, 2,30,384 కిలోమీటర్లు, 2,06,138 మంది ప్రయాణికులను చేరవేసి ఏకంగా ₹1,70,67,162 ఆదాయాన్ని తొర్రూరు డిపో పొందింది. RTC సంస్థ అభివృద్ధికి డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బంది అందరూ కృషి చేశారని తొర్రూర్ డీఎం శ్రీదేవీ తెలిపారు.

Similar News

News October 10, 2025

SRSP: 24 గంటల్లో 74,502 క్యూసెక్కుల ఇన్ ఫ్లో

image

గడిచిన 24 గంటల్లో SRSPలోకి ఎగువ ప్రాంతాల నుంచి 74,502 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చినట్లు అధికారులు తెలిపారు. అంతే మొత్తంలో నీటిని దిగువకు వదిలినట్లు ప్రాజెక్టు అధికారులు చెప్పారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు 75,394 క్యూసెక్కుల ఇన్ ఫ్లోగా వస్తుండగా 21 గేట్ల ద్వారా 65,604 క్యూసెక్కులు వదులుతున్నట్లు పేర్కొన్నారు. ప్రాజెక్టులో తాజాగా 80.053 TMCల నీరు నిల్వ ఉందని అధికారులు వెల్లడించారు.

News October 10, 2025

BJP-RSS సమాజాన్ని విషపూరితం చేస్తున్నాయి: రాహుల్

image

హరియాణాలో IPS ఆఫీసర్ పూరన్ కుమార్ ఆత్మహత్యపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ BJP-RSSను విమర్శించారు. ‘కులం పేరుతో మానవత్వాన్ని అణచివేస్తున్న సోషల్ పాయిజన్‌కు ఇది నిదర్శనం. కులం పేరిట IPS అధికారి అవమానానికి గురైతే ఇక సాధారణ దళితుడి పరిస్థితేంటి? బలహీనవర్గాలకు జరుగుతున్న అన్యాయానికి ఇది అద్దం పడుతోంది. BJP-RSSల విద్వేషం, మనువాద మనస్తత్వం సమాజాన్ని విషపూరితం చేస్తున్నాయి’ అని ఆరోపించారు.

News October 10, 2025

ఎన్టీఆర్: ఉద్యోగాల కల్పనపై మంత్రి కీలక ప్రకటన

image

మైనారిటీ యువతకు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సౌజన్యంతో ఖతార్‌లో హోమ్ కేర్ నర్స్ ఉద్యోగాలు కల్పిస్తున్నామని మంత్రి NMD ఫరూక్ తెలిపారు. ఈ నెల 13న విజయవాడ ప్రభుత్వ ITI కళాశాలలో ఈ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని, ఎంపికైనవారికి నెలకు రూ.1.20 లక్షల వేతనం లభిస్తుందన్నారు. 21- 40 ఏళ్లలోపు వయస్సు ఉండి బీఎస్సీ, GNM నర్సింగ్ పూర్తి చేసిన అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరు కావాలన్నారు.