News October 9, 2025
పాలమూరు: ‘ఎన్.ఎస్.ఎస్ వాలంటీర్లు సమాజ సేవకు అంకితం అవ్వాలి’

ఎన్.ఎస్.ఎస్ వాలంటీర్లు సమాజ సేవకు అంకితం అవ్వాలని పాలమూరు యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ ప్రవీణ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని సెంట్రల్ లైబ్రరీలో ఏడు రోజుల క్యాంపును నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు మూఢనమ్మకాలు, బాల్య వివాహాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రస్తుత సమాజంలో జరుగుతున్న సైబర్ నేరాలపై కూడా అవగాహన కల్పించాలని కోరారు.
Similar News
News October 10, 2025
జడ్చర్ల: వృద్ధ దంపతులను రక్షించేందుకు అధికారుల చర్యలు

జడ్చర్ల మండలం కిష్టారం గ్రామపంచాయతీ అంబఠాపూర్ ఆమ్లెట్ గ్రామానికి చెందిన తానేం బాలయ్య, రాములమ్మ వృద్ధ దంపతులు వాగు దాటే సమయంలో గల్లంతైన విషయం తెలుసుకున్న అధికారులు వారిని రక్షించేందుకు చర్యలు చేపట్టారు. అడిషనల్ కలెక్టర్ డి.మధుసూదన్ నాయక్, తహశీల్దార్ నర్సింగ్ రావు గురువారం రాత్రి 10 గంటలకు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితులను సమీక్షించారు.
News October 10, 2025
MBNR: ఎన్నికలు వాయిదా ఆశావహుల ఆశలు ఆవిరి

ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం రద్దు చేయడంతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఆశావహుల్లో ఆశలు ఆవిరి అయ్యాయి. మళ్లీ షెడ్యూల్ వస్తే ఇప్పుడు ఖరారైన రిజర్వేషన్లు ఉంటాయో.. లేదోనని ఆందోళన చెందుతున్నారు. ఎన్నికలు వాయిదా పడటంతో మరి కొందరు ఆనందంలో ఉన్నారు. తర్వాత రిజర్వేషన్లు తమకు అనుకూలంగా వస్తుందో.. రాదోనని అయోమయంలో పడ్డారు.
News October 10, 2025
MBNR: SGF వాలీబాల్ జట్ల ఎంపిక

మహబూబ్ నగర్ జిల్లా బాదేపల్లి ZPHS(BOY’S) క్రీడా ప్రాంగణంలో ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో అండర్-17 విభాగంలోని బాల, బాలికలకు శుక్రవారం వాలీబాల్ టోర్నమెంట్ కామ్ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కార్యదర్శి శారదాబాయి తెలిపారు. పాల్గొనే ప్రతి క్రీడాకారుడు బోనఫైడ్, ఆధార్, SGF అర్హత పత్రంతో ఉ.8.30 గంటలకు రిపోర్ట్ చేయాలన్నారు. పూర్తి వివరాలకు PD కళ్యాణ్‌ను సంప్రదించాలన్నారు.