News October 9, 2025

బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చాకే ఎన్నికలు: మహేశ్ కుమార్

image

TG: స్థానిక ఎన్నికలపై TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సంచలన ప్రకటన చేశారు. BCలకు 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే స్థానిక ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు. GO-9పై హైకోర్టు స్టే విధించడంతో ఎన్నికలకు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. దీనిపై కోర్టులో పోరాడతామని ఆయన చెప్పారు. దీంతో HCలో పోరాడడం, స్టేపై సుప్రీంకోర్టుకు వెళ్లడమే ప్రభుత్వం ముందున్న ఆప్షన్స్. ఆ తర్వాతే లోకల్ బాడీ ఎలక్షన్స్‌ జరగనున్నాయి.

Similar News

News October 10, 2025

ఇతిహాసాలు క్విజ్ – 31

image

1. విశ్వామిత్రుని ఆశ్రమం పేరేంటి?
2. బర్బరీకుడి తండ్రి ఎవరు?
3. పోతన తన ‘ఆంధ్ర మహాభాగవతం’ గ్రంథాన్ని ఎవరికి అంకితం ఇచ్చాడు?
4. కామ దేవుని వాహనం ఏది?
5. సంస్కృతంలో లక్ష(సంఖ్య)ను ఏమని అంటారు?
✍️ సరైన సమాధానాలను సాయంత్రం 6 గంటలకు పబ్లిష్ చేస్తాం.
<<-se>>#Ithihasaluquiz<<>>

News October 10, 2025

IOCLలో 523పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(IOCL)లో 523 గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిస్‌ పోస్టులకు అప్లై చేయడానికి రేపే(OCT 11)ఆఖరు తేదీ. డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ చేసినవారు అర్హులు. అభ్యర్థుల వయసు 18 నుంచి 24ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు కలదు. విద్యార్హతలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://iocl.com/

News October 10, 2025

నేటి నుంచి NTR వైద్య సేవలు బంద్!

image

AP: రాష్ట్రంలో నేటి నుంచి NTR వైద్య సేవలు మరోసారి నిలిచిపోనున్నాయి. ప్రభుత్వం బకాయిలు విడుదల చేయకపోవడంతో నిలిపివేస్తున్నట్లు నెట్‌వర్క్ ఆస్పత్రులు నిన్ననే ప్రకటించాయి. రూ.2,700 కోట్లు రావాలని, ప్రజాప్రతినిధులను కలిసినా ఫలితం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించాయి. వైద్య సేవలు నిలిపేయొద్దని, సమస్య పరిష్కరిస్తామని మంత్రి సత్యకుమార్ కోరినప్పటికీ నెట్‌వర్క్ ఆస్పత్రులు వెనక్కి తగ్గలేదు.