News October 9, 2025
బీజేపీ అంతర్గత చర్చకు నాకు సంబంధం లేదు: బొంతు

TG: తనను బీజేపీ అభ్యర్థిగా <<17960394>>ప్రతిపాదించిన<<>> విషయంపై పీసీసీ ఉపాధ్యక్షుడు బొంతు రామ్మోహన్ స్పందించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ నుంచి పోటీ చేస్తానన్న మాటల్లో వాస్తవం లేదన్నారు. తన అభ్యర్థిత్వంపై కాషాయ పార్టీలో అంతర్గత చర్చకు తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ‘నేను కాంగ్రెస్‌లోనే ఉన్నా.. ఉంటాను కూడా. ఇక్కడ సంతృప్తిగా ఉన్నాను’ అని ప్రకటన విడుదల చేశారు.
Similar News
News October 10, 2025
ఇతిహాసాలు క్విజ్ – 31

1. విశ్వామిత్రుని ఆశ్రమం పేరేంటి?
2. బర్బరీకుడి తండ్రి ఎవరు?
3. పోతన తన ‘ఆంధ్ర మహాభాగవతం’ గ్రంథాన్ని ఎవరికి అంకితం ఇచ్చాడు?
4. కామ దేవుని వాహనం ఏది?
5. సంస్కృతంలో లక్ష(సంఖ్య)ను ఏమని అంటారు?
✍️ సరైన సమాధానాలను సాయంత్రం 6 గంటలకు పబ్లిష్ చేస్తాం.
<<-se>>#Ithihasaluquiz<<>>
News October 10, 2025
IOCLలో 523పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(IOCL)లో 523 గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే(OCT 11)ఆఖరు తేదీ. డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ చేసినవారు అర్హులు. అభ్యర్థుల వయసు 18 నుంచి 24ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు కలదు. విద్యార్హతలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://iocl.com/
News October 10, 2025
నేటి నుంచి NTR వైద్య సేవలు బంద్!

AP: రాష్ట్రంలో నేటి నుంచి NTR వైద్య సేవలు మరోసారి నిలిచిపోనున్నాయి. ప్రభుత్వం బకాయిలు విడుదల చేయకపోవడంతో నిలిపివేస్తున్నట్లు నెట్‌వర్క్ ఆస్పత్రులు నిన్ననే ప్రకటించాయి. రూ.2,700 కోట్లు రావాలని, ప్రజాప్రతినిధులను కలిసినా ఫలితం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించాయి. వైద్య సేవలు నిలిపేయొద్దని, సమస్య పరిష్కరిస్తామని మంత్రి సత్యకుమార్ కోరినప్పటికీ నెట్‌వర్క్ ఆస్పత్రులు వెనక్కి తగ్గలేదు.