News October 9, 2025
BREAKING: రేపు ఉమ్మడి పాలమూరు బంద్: బీసీ సమాజ్

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అంశంలో కోర్టు నుంచి స్టే వచ్చేందుకు పిటిషన్లు వేసి, బీసీలను కుట్రపూరితంగా మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా రేపు బంద్‌కు పిలుపునిస్తున్నామని బీసీ సమాజ్ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ సాగర్ వెల్లడించారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42శాతం రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని కాంగ్రెస్ చెప్పిందని గుర్తుచేశారు.
Similar News
News October 10, 2025
సదరన్ పవర్ ఛైర్మన్‌గా పల్నాడు జిల్లా మొదటి కలెక్టర్

పల్నాడు జిల్లా మొట్టమొదటి కలెక్టర్‌గా పనిచేసిన శివ శంకర్ లోతేటిని రాష్ట్ర ప్రభుత్వం సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించింది. ఈ మేరకు గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో తెలంగాణ క్యాడర్‌కు బదిలీ చేసిన అంశంపై ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేసి గెలుపొందారు. తాజాగా జరిగిన ఐఏఎస్‌ల బదిలీల్లో భాగంగా ప్రభుత్వం ఆయన్ను సదరన్ పవర్ ఛైర్మన్‌గా నియమించింది.
News October 10, 2025
SRSP: 24 గంటల్లో 74,502 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

గడిచిన 24 గంటల్లో SRSPలోకి ఎగువ ప్రాంతాల నుంచి 74,502 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చినట్లు అధికారులు తెలిపారు. అంతే మొత్తంలో నీటిని దిగువకు వదిలినట్లు ప్రాజెక్టు అధికారులు చెప్పారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు 75,394 క్యూసెక్కులు ఇన్‌ఫ్లోగా వస్తుండగా 21 గేట్ల ద్వారా 65,604 క్యూసెక్కుల నీరు వదులుతున్నట్లు పేర్కొన్నారు. ప్రాజెక్టులో తాజాగా 80.053 TMCల నీరు నిల్వ ఉందని అధికారులు వెల్లడించారు.
News October 10, 2025
కడప జిల్లాలో ఈ దగ్గు సిరప్ నిషేధం

‘RespiFresh-TR’ దగ్గు సిరప్‌లో నిషేధిత DEG సాల్వెంట్ 35 శాతం పైగా ఉండటంతో దాన్ని ప్రభుత్వం నిషేధించిందని ఔషధ నియంత్రణ శాఖ కర్నూలు డీడీ నాగ కిరణ్ కుమార్ వెల్లడించారు. ఆ సిరప్‌ను టెస్ట్ చేసినప్పుడు, వాటిలో రెండు కంపెనీల మందుల్లో నిషేధిత DEG సాల్వెంట్ బయట పడిందన్నారు. ఇందులో ‘RespiFresh-TR’ సిరప్ ఏపీ మార్కెట్లోకి వచ్చినట్లు గుర్తించామన్నారు. కడప జిల్లా 24 బాటిళ్లను గుర్తించి రిటర్న్ చేశామన్నారు.