News October 9, 2025
సిల్వర్.. ధరలు చూస్తే ఫీవర్!

అందరూ బంగారం గురించే మాట్లాడుకుంటున్నారనో ఏమో <<17959732>>వెండి<<>> తన కోపాన్ని ధరలపై చూపిస్తున్నట్లుంది. కిలోపై వందో రెండొందలు పెరిగితే లైట్ తీసుకుంటున్నారని ఏకంగా రూ.వేలల్లో పెరుగుతోంది. దీంతో బంగారమే కాదు వెండిని సైతం కొనలేని పరిస్థితి నెలకొంది. గతేడాది కిలో రూ.లక్షకు చేరువైతేనే వామ్మో అనుకునేలోపే రూ.2లక్షల వైపు దూసుకెళ్తోంది. దీంతో సామాన్యుల కొనుగోళ్లు మందగించగా, కొందరు సిల్వర్‌లో పెట్టుబడులు పెడుతున్నారు.
Similar News
News October 10, 2025
ట్రంప్‌కు ఈ ఏడాది నోబెల్ రానట్టే.. కారణమిదే!

NOBEL Peace Prize కోసం ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎన్నో యుద్ధాలు ఆపానని, అవార్డు తనకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. అందుకు తగ్గట్టే ఆయన్ను పలు దేశాలు (పాకిస్థాన్, ఇజ్రాయెల్, కాంబోడియా) నామినేట్ చేశాయి. కానీ ఈసారి ఆయనకు నోబెల్ రానట్టేనని తెలుస్తోంది. FEB 1 లోగా ఆయన్ను నామినేట్ చేయాల్సి ఉండగా, ఆ లోగా ఒక్క దరఖాస్తూ రాకపోవడమే కారణం. దీంతో ఈ ఏడాదికి నోబెల్ కమిటీ పరిగణనలోకి తీసుకోలేదని తెలుస్తోంది.
News October 10, 2025
నోబెల్ శాంతి బహుమతి గెలుచుకున్న అమెరికా ప్రెసిడెంట్లు

*థియోడర్ రూజ్‌వెల్ట్ (1906): రస్సో-జపాన్ యుద్ధాన్ని ఆపినందుకు ఈ పురస్కారం దక్కింది. నోబెల్ శాంతి బహుమతి గెలుచుకున్న తొలి యూఎస్ ప్రెసిడెంట్ ఈయనే.
*విల్సన్ (1919): మొదటి ప్రపంచ యుద్ధాన్ని ఆపేందుకు పని చేసిన లీగ్ ఆఫ్ నేషన్స్‌లో కీలక పాత్ర
*జిమ్మీ కార్టర్ (2002): అంతర్జాతీయ ఉద్రిక్తతలకు పరిష్కారం చూపడంతో పాటు మానవ హక్కుల పరిరక్షణ
*ఒబామా (2009): అణ్వాయుధాలను ఆపేందుకు చేసిన కృషి
News October 10, 2025
BJP-RSS సమాజాన్ని విషపూరితం చేస్తున్నాయి: రాహుల్

హరియాణాలో IPS ఆఫీసర్ పూరన్ కుమార్ ఆత్మహత్యపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ BJP-RSSను విమర్శించారు. ‘కులం పేరుతో మానవత్వాన్ని అణచివేస్తున్న సోషల్ పాయిజన్‌కు ఇది నిదర్శనం. కులం పేరిట IPS అధికారి అవమానానికి గురైతే ఇక సాధారణ దళితుడి పరిస్థితేంటి? బలహీనవర్గాలకు జరుగుతున్న అన్యాయానికి ఇది అద్దం పడుతోంది. BJP-RSSల విద్వేషం, మనువాద మనస్తత్వం సమాజాన్ని విషపూరితం చేస్తున్నాయి’ అని ఆరోపించారు.