News October 9, 2025

ట్రంప్ మెడలో నోబెల్ మెడల్.. AI ఇమేజ్ షేర్ చేసిన నెతన్యాహు

image

US ప్రెసిడెంట్ ట్రంప్‌కు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని ఇజ్రాయెల్ PM నెతన్యాహు సూచించారు. అందుకు ఆయన అర్హుడని, ఇజ్రాయెల్-హమాస్ మధ్య సీజ్‌ఫైర్, బందీల విడుదలకు ఎంతో కృషి చేశారని ఆకాశానికెత్తారు. నోబెల్ శాంతి బహుమతి ప్రకటనకు ఒకరోజు ముందు నెతన్యాహు తన స్నేహితుడి(ట్రంప్) కోసం ఈ ట్వీట్ చేయడం గమనార్హం. ట్రంప్ నోబెల్ మెడల్ మెడలో వేసుకోగా నెతన్యాహు సహా మరికొందరు చప్పట్లు కొడుతున్న AI ఇమేజ్‌ను షేర్ చేశారు.

Similar News

News October 10, 2025

పెర్ఫ్యూమ్ అప్లై చేసేటపుడు ఈ టిప్స్ పాటించండి

image

ప్రస్తుతకాలంలో పెర్ఫ్యూమ్స్ వాడే వారి సంఖ్య పెరిగింది. అయితే ఆహ్లాదకరమైన సువాసన పొందడానికి కొన్ని టిప్స్ పాటించాలంటున్నారు నిపుణులు. వీటిని సీజన్స్ బట్టి మార్చాలి. ఫ్రెష్ అయిన తర్వాత స్ప్రే చేసుకుంటే ఎక్కువసేపు నిలిచి ఉంటుంది. పల్స్ పాయింట్స్, నెక్, చెవి వెనుక స్ప్రే చెయ్యాలి. మాయిశ్చరైజర్ రాసి, దానిపై పెర్ఫ్యూమ్ స్ప్రే చెయ్యాలి. బాటిల్ ఫ్రిజ్‌లో పెడితే ఫ్రాగ్రెన్స్ ఎక్కువసేపు ఉంటుంది.

News October 10, 2025

రెండో టెస్టు.. భారత్ బ్యాటింగ్

image

వెస్టిండీస్‌తో జరిగే రెండో టెస్టులో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
IND: జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, గిల్ (C), ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, బుమ్రా, సిరాజ్.

News October 10, 2025

దివ్యశబ్దరాశులే వేద మంత్రాలు

image

దివ్యబల సంపన్నులైన వేద కాలం నాటి రుషులు తమ ఆధ్యాత్మిక జ్ఞాన సంపదతో దర్శించిన దివ్య శబ్దరాశులే ‘వేద మంత్రాలు’. ఈ రుషులు వేదద్రష్టలే(వేదాలను చూసినవారు) కానీ రచయితలు కాదు. అందుకే వేదాలను శ్రుతులంటారు. అయితే వేద మంత్రాలను స్వరబద్ధంగానే వల్లె వేయాలి. లేకుంటే అనర్థాలు సంభవిస్తాయి. లోకాసమస్తా సుఖినోభవంతు అని అన్ని లోకాలు సుఖంగా ఉండాలి అంటుంది వేదం. <<-se>>#VedikVibes<<>>