News October 9, 2025

శ్రీ సత్యసాయి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ బదిలీ

image

సత్యసాయి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌ బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనను ఆంధ్రప్రదేశ్‌ మెరిటైమ్‌ బోర్డు సీఈఓగా నియమించారు. అదనంగా ఏపీ మెరిటైమ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ వైస్‌ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ బాధ్యతలు కూడా ఆయనకు అప్పగించారు.

Similar News

News October 10, 2025

బిజినెస్ న్యూస్ రౌండప్

image

* 2025-26 FY రెండో త్రైమాసికంలో రూ.12,075 కోట్ల నికర లాభం ప్రకటించిన TCS. ఒక్కో షేర్‌పై రూ.11 మధ్యంతర డివిడెండ్ ప్రకటన
* LG ఎలక్ట్రానిక్స్ IPO సూపర్ సక్సెస్: 7.13 కోట్ల షేర్లు జారీ చేయగా 385 కోట్ల షేర్లకు బిడ్స్ దాఖలు. వీటి విలువ దాదాపు రూ.4.4 లక్షల కోట్లు. ఇవాళ IPO అలాట్‌మెంట్
* నేడు భేటీ కానున్న టాటా సంస్థల ట్రస్టీలు. కొద్దిరోజులుగా బోర్డు సభ్యుల మధ్య నెలకొన్న విభేదాలకు తెరదించే అవకాశం

News October 10, 2025

చిత్తూరు జిల్లాలో ఈ దగ్గు మందు వాడుతున్నారా?

image

‘RespiFresh-TR’ దగ్గు సిరప్‌లో నిషేధిత DEG సాల్వెంట్ 35%పైగా ఉండటంతో దాన్ని ప్రభుత్వం నిషేధించిందని ఔషధ నియంత్రణ శాఖ కర్నూలు DD నాగ కిరణ్ కుమార్ వెల్లడించారు. ఆ సిరప్‌‌ను టెస్ట్ చేసినప్పుడు నిషేధిత DEG సాల్వెంట్ బయట పడిందన్నారు. రాయలసీమ జిల్లాల్లో ‘RespiFresh-TR’ సిరప్ మార్కెట్లో ఉందని చెప్పారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 66, కడప జిల్లాలోని షాపుల్లో 24 బాటిళ్లను గుర్తించి రిటర్న్ చేశామన్నారు.

News October 10, 2025

JGTL: క్రిప్టో కరెన్సీ పేరుతో మోసం.. ముగ్గురి అరెస్ట్

image

మెటా ఫండ్ క్రిప్టో కరెన్సీ పేరుతో అమాయకులను బురిడీ కొట్టించి భారీ పెట్టుబడులు పెట్టించి మోసానికి పాల్పడిన ఘటన JGTL జిల్లాలో చోటుచేసుకుంది. కొడిమ్యాల PSలో నమోదైన ఈ కేసులో అదే గ్రామానికి చెందిన తిరుపతిరెడ్డి, రాజు అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసి గురువారం రిమాండ్‌కు తరలించారు. అలాగే జగిత్యాలకు చెందిన ఫొటోగ్రాఫర్ ఈ కేసులో కీలకంగా వ్యవహరించగా, సదరు ఫొటోగ్రాఫర్‌నూ అరెస్టు చేసినట్లు సమాచారం.