News October 9, 2025
సానుకూల దృక్ఫథంతో వ్యవహరించాలి: DRO

అర్జీదారుల సమస్యలను సానుకూల దృష్టితో పరిష్కరించాలని DRO శ్రీనివాసమూర్తి సూచించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పెండింగ్ మ్యుటేషన్లను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. సమస్యలు పరిష్కారం కాని సందర్భాల్లో నిబంధనలను వివరించి, నోటీసుపై సంతకం తీసుకోవాలన్నారు. రెవెన్యూ అధికారులు అర్జీదారుల సంతృప్తికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు.
Similar News
News October 10, 2025
విజయనగరం: GST.. రేట్లు తగ్గలే..!

కేంద్ర ప్రభుత్వం GST తగ్గించి నేటికి 18 రోజులైనా పాతధరలకే అమ్మకాలు సాగిస్తున్నట్లు ఆరోపణలొస్తున్నాయి. ప్రధానంగా స్టేషనరీ వస్తువులైన నోటుబుక్స్, ఎక్సర్‌సైజ్, గ్రాఫ్ బుక్స్, లాబొరేటరీ నోటుబుక్స్, పెన్సిల్స్, ఎరేజర్స్, క్రేయాన్స్ తదితర వస్తువులను 12% నుంచి 0% చేసినా కొన్నిచోట్లు పాత ధరలతోనే అమ్ముతున్నారు. దీంతో పేద విద్యార్థులకు GST ప్రయోజనం చేకూరడం లేదు. మీ ప్రాంతంలో GST తగ్గిందా? కామెంట్ చేయండి.
News October 10, 2025
అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి: కలెక్టర్

అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి రాష్ట్రస్థాయిలో జిల్లాను అభివృద్ధిలో మొదటి 5 స్థానాల్లో ఉండేలా కృషి చేయాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి సూచించారు. గురువారం తన ఛాంబర్‌లో అధికారులతో సమీక్షించారు. సివిల్ సప్లైస్ ద్వారా స్మార్ట్ రైస్ కార్డులు పెండింగ్ లేకుండా చూడాలన్నారు. సాంఘిక సంక్షేమ శాఖలకు నిర్దేశించిన లక్ష్యాలను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు.
News October 9, 2025
బాణాది చెరువులో పడి వ్యక్తి మృతి

వేపాడ మండలం బాణాదిలో సంపర్తి ఆంజనేయులు (32) ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందిన ఘటన గురువారం చోటు చేసుకుంది. ఎస్సై సుదర్శన్ వివరాల మేరకు.. అతను గ్రామానికి దగ్గరలో ఉన్న తమ్మ చెరువుకు దుస్తులు ఉతకడానికి వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.