News October 9, 2025
శ్రీ సత్యసాయి జిల్లా నూతన జాయింట్ కలెక్టర్‌గా మౌర్య భరద్వాజ్

శ్రీ సత్యసాయి జిల్లా నూతన జాయింట్ కలెక్టర్‌గా మంత్రి మౌర్య భరద్వాజ్‌ను నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులను జారీ చేసింది. ఈయన గతంలో కర్నూలు జిల్లా ఆదోని సబ్ కలెక్టర్‌గా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం జాయింట్ కలెక్టర్‌గా ఉన్న అభిషేక్ కుమార్ బదిలీ అవ్వడంతో మౌర్య భరద్వాజ్‌ను ప్రభుత్వం నియమించింది. త్వరలోనే మౌర్య బాధ్యతలు చేపట్టనున్నట్లు కలెక్టర్ కార్యాలయ సిబ్బంది తెలిపారు.
Similar News
News October 10, 2025
చిత్తూరు జిల్లాలో ఈ దగ్గు మందు వాడుతున్నారా?

‘RespiFresh-TR’ దగ్గు సిరప్‌లో నిషేధిత DEG సాల్వెంట్ 35%పైగా ఉండటంతో దాన్ని ప్రభుత్వం నిషేధించిందని ఔషధ నియంత్రణ శాఖ కర్నూలు DD నాగ కిరణ్ కుమార్ వెల్లడించారు. ఆ సిరప్‌ను టెస్ట్ చేసినప్పుడు నిషేధిత DEG సాల్వెంట్ బయట పడిందన్నారు. రాయలసీమ జిల్లాల్లో ‘RespiFresh-TR’ సిరప్ మార్కెట్లో ఉందని చెప్పారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 66, కడప జిల్లాలోని షాపుల్లో 24 బాటిళ్లను గుర్తించి రిటర్న్ చేశామన్నారు.
News October 10, 2025
JGTL: క్రిప్టో కరెన్సీ పేరుతో మోసం.. ముగ్గురి అరెస్ట్

మెటా ఫండ్ క్రిప్టో కరెన్సీ పేరుతో అమాయకులను బురిడీ కొట్టించి భారీ పెట్టుబడులు పెట్టించి మోసానికి పాల్పడిన ఘటన JGTL జిల్లాలో చోటుచేసుకుంది. కొడిమ్యాల PSలో నమోదైన ఈ కేసులో అదే గ్రామానికి చెందిన తిరుపతిరెడ్డి, రాజు అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసి గురువారం రిమాండ్‌కు తరలించారు. అలాగే జగిత్యాలకు చెందిన ఫొటోగ్రాఫర్ ఈ కేసులో కీలకంగా వ్యవహరించగా, సదరు ఫొటోగ్రాఫర్‌నూ అరెస్టు చేసినట్లు సమాచారం.
News October 10, 2025
పెర్ఫ్యూమ్ అప్లై చేసేటపుడు ఈ టిప్స్ పాటించండి

ప్రస్తుతకాలంలో పెర్ఫ్యూమ్స్ వాడే వారి సంఖ్య పెరిగింది. అయితే ఆహ్లాదకరమైన సువాసన పొందడానికి కొన్ని టిప్స్ పాటించాలంటున్నారు నిపుణులు. వీటిని సీజన్స్ బట్టి మార్చాలి. ఫ్రెష్ అయిన తర్వాత స్ప్రే చేసుకుంటే ఎక్కువసేపు నిలిచి ఉంటుంది. పల్స్ పాయింట్స్, నెక్, చెవి వెనుక స్ప్రే చెయ్యాలి. మాయిశ్చరైజర్ రాసి, దానిపై పెర్ఫ్యూమ్ స్ప్రే చెయ్యాలి. బాటిల్ ఫ్రిజ్‌లో పెడితే ఫ్రాగ్రెన్స్ ఎక్కువసేపు ఉంటుంది.