News October 9, 2025
నైట్ డ్యూటీలతో సంతానోత్పత్తిపై ప్రభావం

నైట్‌షిఫ్టుల్లో ఎక్కువగా పనిచేయడం వల్ల మహిళల సంతానోత్పత్తిపై ప్రభావం పడుతుందంటున్నారు గైనకాలజిస్టులు. ‘అస్తవ్యస్త పనివేళలతో హార్మోన్ల సమస్యలు, పీరియడ్లు మిస్సవడం వల్ల గర్భధారణలో ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటిస్తూ పోషకాహారం, తగినంత నిద్ర ఉండేలా చూసుకోవాలి’ అని సూచిస్తున్నారు.
* ప్రతిరోజూ మహిళలు, చైల్డ్ కేర్ కంటెంట్ కోసం <<-se_10014>>వసుధ కేటగిరీ<<>>లోకి వెళ్లండి.
Similar News
News October 10, 2025
కెప్టెన్సీ మార్పుపై స్పందించిన గంగూలీ

రోహిత్ శర్మను ODI కెప్టెన్సీ నుంచి తప్పించడంపై మాజీ క్రికెటర్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశారు. రోహిత్, BCCI మధ్య పరస్పర అంగీకారం ద్వారా కెప్టెన్సీ మార్పు జరిగి ఉండొచ్చని చెప్పారు. ప్లేయర్ల లైఫ్‌లో ఇది సాధారణంగా జరిగేదేనని తెలిపారు. ‘రోహిత్ గొప్ప లీడర్. 2027లో అతడికి 40ఏళ్లు వస్తాయి. క్రీడల్లో ఇది పెద్ద నంబర్. నాకు, ద్రవిడ్‌కు, అందరికీ జరిగింది. 40ఏళ్లు వచ్చాక గిల్‌కూ ఇలానే జరుగుతుంది’ అని అన్నారు.
News October 10, 2025
రాష్ట్రంలో 118ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

TGSLPRBలో 118 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ(OCT 11). ఏదైనా బ్యాచిలర్ డిగ్రీతో పాటు LLBలేదా బీఎల్ డిగ్రీ ఉత్తీర్ణులైనవారు అప్లై చేసుకోవచ్చు. క్రిమినల్ కోర్టుల్లో కనీసం 3 సంవత్సరాల ప్రాక్టీసింగ్ అడ్వకేట్ అయి ఉండాలి. అభ్యర్థుల వయసు 34ఏళ్లు మించరాదు. రిజర్వేషన్ గల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు కలదు. వెబ్‌సైట్: www.tgprb.in
News October 10, 2025
VOAల మూడేళ్ల కాలపరిమితి ఉత్తర్వులు నిలిపివేత

AP: గ్రామ సంఘ సహాయకుల(VOA)కు సంబంధించి గత ప్రభుత్వం విధించిన మూడేళ్ల కాలపరిమితిని కూటమి సర్కార్ నిలిపివేసింది. VOA ఎంపిక లేదా తొలగింపు అనేది గ్రామ సంఘాల నిర్ణయం మేరకు ఉంటుందని తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. VOAలు అవినీతికి పాల్పడితే వారిపై చర్యలు తీసుకునే అధికారాన్ని DRDA ప్రాజెక్టు డైరెక్టర్‌కు అప్పగించింది. కాగా రాష్ట్రంలో 27వేల మంది VOAలు పనిచేస్తున్నారు.