News October 9, 2025
ఎలక్షన్ నోటిఫికేషన్ నిలిపివేత

TG: స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌ను నిలిపివేస్తూ SEC ప్రకటన విడుదల చేసింది. BC రిజర్వేషన్లతో పాటు నోటిఫికేషన్‌పై హైకోర్టు స్టే విధించడంతో ఈ నిర్ణయం తీసుకుంది. BCలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ఇటీవల GO-9ను జారీ చేసింది. దీని ప్రకారమే SEC షెడ్యూల్ ప్రకటించి, ఇవాళ తొలి విడత ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే GO-9 చెల్లదంటూ కొందరు కోర్టుకు వెళ్లడంతో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది.
Similar News
News October 10, 2025
ట్రాన్స్‌జెండర్‌కు టికెట్.. పీకే ప్లాన్ పనిచేసేనా?

బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రావడంతో జన్ సురాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిశోర్ తన వ్యూహాలకు పదును పెట్టారు. నిన్న తొలి విడతలో భాగంగా 51 మంది అభ్యర్థులను ప్రకటించారు. ఈ జాబితాలో డాక్టర్లు, లాయర్లు, రిటైర్డ్ అధికారులు & పోలీసులు సహా ట్రాన్స్‌జెండర్ సోషల్ యాక్టివిస్ట్ ప్రీతి కిన్నర్ కూడా ఉన్నారు. ‘వీరికి ఓట్లు వేయకపోతే నాకు నష్టం లేదు.. బిహార్ ప్రజలే ఆ భారం మోయాలి’ అంటూ పీకే మాటల గారడీకి తెరలేపారు.
News October 10, 2025
కెప్టెన్సీ మార్పుపై స్పందించిన గంగూలీ

రోహిత్ శర్మను ODI కెప్టెన్సీ నుంచి తప్పించడంపై మాజీ క్రికెటర్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశారు. రోహిత్, BCCI మధ్య పరస్పర అంగీకారం ద్వారా కెప్టెన్సీ మార్పు జరిగి ఉండొచ్చని చెప్పారు. ప్లేయర్ల లైఫ్‌లో ఇది సాధారణంగా జరిగేదేనని తెలిపారు. ‘రోహిత్ గొప్ప లీడర్. 2027లో అతడికి 40ఏళ్లు వస్తాయి. క్రీడల్లో ఇది పెద్ద నంబర్. నాకు, ద్రవిడ్‌కు, అందరికీ జరిగింది. 40ఏళ్లు వచ్చాక గిల్‌కూ ఇలానే జరుగుతుంది’ అని అన్నారు.
News October 10, 2025
రాష్ట్రంలో 118ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

TGSLPRBలో 118 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ(OCT 11). ఏదైనా బ్యాచిలర్ డిగ్రీతో పాటు LLBలేదా బీఎల్ డిగ్రీ ఉత్తీర్ణులైనవారు అప్లై చేసుకోవచ్చు. క్రిమినల్ కోర్టుల్లో కనీసం 3 సంవత్సరాల ప్రాక్టీసింగ్ అడ్వకేట్ అయి ఉండాలి. అభ్యర్థుల వయసు 34ఏళ్లు మించరాదు. రిజర్వేషన్ గల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు కలదు. వెబ్‌సైట్: www.tgprb.in