News October 9, 2025

ట్రంప్‌కు నోబెల్ ఇవ్వకుంటే.. నార్వే భవిష్యతేంటి?

image

2025కు గాను నోబెల్ శాంతి బహుమతిని రేపు ప్రకటించనున్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. నార్వేజియన్ నోబెల్ కమిటీ విజేతను డిసైడ్ చేయనుంది. దీంతో నార్వే నేతలు, ప్రజల్లో ఆందోళన మొదలైంది. ట్రంప్‌ను నోబెల్ బహుమతికి ఎంపిక చేయకపోతే ఆ ప్రభావం US-నార్వే రిలేషన్స్‌పై పడుతుందని అభిప్రాయపడుతున్నారు. చైనా, భారత్ వంటి అగ్రదేశాలనే లెక్కచేయని ట్రంప్ తమపై కఠిన చర్యలు తీసుకునే ప్రమాదముందని ఆందోళన చెందుతున్నారు.

Similar News

News October 10, 2025

AP అప్‌డేట్స్ @10AM

image

*రాష్ట్రవ్యాప్తంగా నిలిచిపోయిన ఎన్టీఆర్ వైద్యసేవలు. ఎమర్జెన్సీ సహా అన్నిరకాల వైద్యసేవలను నెట్‌వర్క్ ఆస్పత్రులు నిలిపివేశాయి. రూ.650 కోట్ల బకాయిలు విడుదల చేసే వరకు చర్చలకు వెళ్లకూడదని నిర్ణయించాయి.
*మంత్రివర్గ సమావేశం ప్రారంభం. 30 అంశాలపై చర్చ. రూ.1,14,821 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలపనున్న క్యాబినెట్.
*ప్రకాశం జిల్లా సింగరాయకొండలోని పొగాకు పరిశ్రమలో అగ్నిప్రమాదం. రూ.500 కోట్ల నష్టమని అంచనా.

News October 10, 2025

తెల్ల జుట్టుకు సొరకాయతో చెక్

image

ఈరోజుల్లో వయసుతో సంబంధం లేకుండా జుట్టు తెల్లబడుతోంది. మార్కెట్లో దొరికే ఉత్పత్తులు కాకుండా వంటింట్లో ఉండే సొరకాయ దీనికి పరిష్కారం చూపుతుందంటున్నారు నిపుణులు. సొరకాయను ముక్కలు చేసి వారంపాటు ఎండబెట్టుకోవాలి. ఒక పాత్రలో కొబ్బరినూనె, ఎండబెట్టిన ముక్కలు వేసి మరిగించాలి. దీన్ని వడబోసి గాజుసీసాలో నిల్వ చేసుకోవాలి. దీన్ని వారానికొకసారి తలకు అప్లై చేసి తలస్నానం చేస్తే జుట్టు నల్లగా మారుతుంది. <<-se>>#haircare<<>>

News October 10, 2025

ఆహారం తినకూడని వేళలు

image

శరీరం దైవత్వంతో నిండాలంటే, ఆహారం తీసుకునే విషయంలో పవిత్ర నియమాలు పాటించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. సూర్యాస్తమయ సమయంలోని అసుర సంధ్య వేళలో ఎట్టి పరిస్థితుల్లో ఆహారం ముట్టకూడదు. ఆ సమయంలో దైవ ధ్యానం, ప్రశాంతత ముఖ్యం. రాత్రి పడుకునే ముందు కూడా భోజనం చేయకూడదు. ఒకవేళ చేస్తే.. ఏకాగ్రత తగ్గుతుంది. ఆహారం సరిగ్గా జీర్ణమవ్వదు. సూర్య గ్రహణానికి 12 గంటలు, చంద్ర గ్రహణానికి 9 గంటల ముందు నుంచే ఉపవాసం ఉండాలి.