News October 10, 2025
ఆదర్శ గ్రామ యోజన’ పనులు త్వరితగతిన పూర్తి: కలెక్టర్

జిల్లాలో ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన కింద ఎంపిక చేసిన 81 గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలను నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌తో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. పనులను త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు.
Similar News
News October 10, 2025
మోహన్ బాబు వర్సిటీకి ఊరట

AP: <<17943028>>MB వర్సిటీకి<<>> హైకోర్టులో ఊరట దక్కింది. నిబంధనల ఉల్లంఘనతో దీని గుర్తింపు రద్దు, ₹26.17 కోట్ల అదనపు ఫీజు రిఫండ్ కోసం ఇటీవల APSCHE ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. దీనిపై వర్సిటీ కోర్టును ఆశ్రయించగా స్టే విధించింది. ADMIN బాధ్యతల్ని SVUకి అప్పగించాలన్న ఉత్తర్వునూ నిలిపివేసింది. ఆదేశాలిచ్చినా సిఫార్సులను వెబ్సైట్లో అప్లోడ్ చేయడంపై APSCHEని ప్రశ్నించింది. తమ ఉత్తర్వులు అప్లోడ్ చేయాలని ఆదేశించింది.
News October 10, 2025
అసలైన భక్తికి నిదర్శనం మయూరధ్వజుని త్యాగం

నిజాయితీ, భక్తితో సేవించేవారికి భగవంతుడు ప్రత్యక్షమవుతాడు అనడానికి మయూరధ్వజుని కథే నిదర్శనం. శ్రీకృష్ణుడు ఇచ్చిన పరీక్షలో తన భక్తిని నిరూపించుకోవడానికి ఆయన తన కుమారుడిని సగంగా కోసి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. అతిథి రూపంలో వచ్చిన భగవంతుడిని సంతృప్తి పరచడమే ఆయన ధర్మంగా భావించాడు. అలాంటి గొప్ప ఆత్మత్యాగానికి ముగ్ధుడైన శ్రీకృష్ణుడు, వెంటనే ఆయనకు సాక్షాత్కారం ఇచ్చి, శుభాన్ని కలిగించాడు. <<-se>>#Bakthi<<>>
News October 10, 2025
KNR: BRS కొత్త రాగం.. ‘రాబోయే రోజుల్లో BC CM’..!

BRS మరో కొత్త రాగం అందుకుంది. రాబోయే రోజుల్లో BRSలో BC సీఎం అయ్యే అవకాశాలున్నాయని KNR MLA గంగుల కమలాకర్ ఓ TV ఛానల్ డిబేట్లో సెన్సేషన్ కామెంట్స్ చేశారు. ఇంటింటికీ CONG బాకీ కార్డుల కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మళ్లీ ఈ వ్యాఖ్యలను పునరుద్ఘాటించారు. BCలకు రాజ్యాధికారం లక్ష్యంగా BRS పోరాటం చేస్తుందని MLA అన్నారు. పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలకు వెళ్తే CONG తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు.