News October 10, 2025
నాగర్‌కర్నూల్: ‘చేగువేరా స్ఫూర్తితో యువత ఉద్యమించాలి’

నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో గురువారం డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో విప్లవ వీరుడు చేగువేరా 58వ వర్ధంతిని నిర్వహించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా డీవైఎఫ్ఐ మాజీ అధ్యక్షుడు ఆర్.శ్రీనివాస్ మాట్లాడుతూ.. చేగువేరా స్ఫూర్తితో సమాజంలోని అసమానతలపై యువత ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చంద్రమౌళి, సుల్తాన్, కృష్ణయ్య, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
Similar News
News October 10, 2025
డిసెంబర్‌లో ఐపీఎల్-2026 వేలం!

ఐపీఎల్-2026 వేలం డిసెంబర్ 13-15 తేదీల్లో జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మేరకు బీసీసీఐతో ఫ్రాంచైజీలు చర్చిస్తున్నట్లు Cricbuzz వెల్లడించింది. ప్లేయర్ల రిటెన్షన్‌కు నవంబర్ 15 వరకు డెడ్‌లైన్ ఉండొచ్చని సమాచారం. గత రెండు సీజన్లలో విదేశాల్లో వేలం జరగ్గా, ఈ సారి భారత్‌లో నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. వీటన్నింటిపై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
News October 10, 2025
ఈఫిల్ టవర్‌ను కూల్చనున్నారా?.. నిజమిదే!

ప్రపంచ ప్రఖ్యాతి పొందిన పారిస్‌లోని ఈఫిల్ టవర్‌ను కూల్చేయనున్నట్లు SMలో ఓ వార్త వైరలవుతోంది. 1889లో నిర్మించిన ఈ టవర్ బలహీనపడిందని, నిర్వహణ ఖర్చులు ఎక్కువవడం వల్లే తొలగిస్తున్నట్లు పుకార్లు వ్యాపించాయి. సమ్మె కారణంగా టవర్ సందర్శన నిలిపివేశారు. కాగా కూల్చేందుకే అంటూ కొందరు పోస్టులు చేశారు. చాలామంది దీనిపై పోస్టులు చేయడంతో నిర్వహణ సంస్థ ఈ వార్తలను ఖండించింది. టవర్ కూల్చట్లేదని స్పష్టం చేసింది.
News October 10, 2025
హుజూరాబాద్: రెస్టారెంట్ సిబ్బందిపై దాడి..!

హుజూరాబాద్ పట్టణంలోని కరీంనగర్ రోడ్డులో ఉన్న నిర్వాణ రెస్టారెంట్ సిబ్బందిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. నిన్న రాత్రి 11 గంటల సమయంలో రెస్టారెంట్‌లో భోజనం చేసిన అనంతరం కొందరు వ్యక్తులు సిబ్బందిపై చేయిచేసుకున్నారు. గాయపడిన సిబ్బందిని చికిత్స కోసం స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాగా, దాడి చేయడానికి గాల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.