News October 10, 2025

మహబూబ్‌నగర్: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి మృతి

image

మహబూబ్‌నగర్ కార్పొరేషన్ పరిధిలోని చౌదర్‌పల్లి శివారులో నేషనల్ హైవే 167పై ఈనెల ఆరో తేదీన గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి గాయపడ్డాడు. అతడిని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ నేడు మృతిచెందినట్లు రూరల్ ఎస్ఐ విజయ్ వెల్లడించారు. మృతుడు వయసు 45 సంవత్సరాలు ఉంటుందని, మృతదేహాన్ని జనరల్ ఆసుపత్రి మార్చరీలో భద్రపరిచామని, వివరాలకు 8712659336 నంబర్‌ను సంప్రదించాలన్నారు.

Similar News

News October 10, 2025

వడ్డేమాన్‌లో.. అత్యధిక వర్షపాతం నమోదు

image

మహబూబ్ నగర్ జిల్లాలో 24 గంటల్లో వివిధ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. అత్యధికంగా చిన్నచింతకుంట మండలం వడ్డేమాన్‌లో 81.5 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డు అయ్యింది. నవాబుపేట 70, దేవరకద్ర 37.5, కౌకుంట్ల 31.3, చిన్నచింతకుంట 30.5, మూసాపేట మండలం జానంపేట 29.3, అడ్డాకుల 16.5, కోయిలకొండ మండలం పారుపల్లి 4.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.

News October 10, 2025

జడ్చర్ల: వృద్ధ దంపతులను రక్షించేందుకు అధికారుల చర్యలు

image

జడ్చర్ల మండలం కిష్టారం గ్రామపంచాయతీ అంబఠాపూర్ ఆమ్లెట్ గ్రామానికి చెందిన తానేం బాలయ్య, రాములమ్మ వృద్ధ దంపతులు వాగు దాటే సమయంలో గల్లంతైన విషయం తెలుసుకున్న అధికారులు వారిని రక్షించేందుకు చర్యలు చేపట్టారు. అడిషనల్ కలెక్టర్ డి.మధుసూదన్ నాయక్, తహశీల్దార్ నర్సింగ్ రావు గురువారం రాత్రి 10 గంటలకు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితులను సమీక్షించారు.

News October 10, 2025

MBNR: ఎన్నికలు వాయిదా ఆశావహుల ఆశలు ఆవిరి

image

ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం రద్దు చేయడంతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఆశావహుల్లో ఆశలు ఆవిరి అయ్యాయి. మళ్లీ షెడ్యూల్ వస్తే ఇప్పుడు ఖరారైన రిజర్వేషన్లు ఉంటాయో.. లేదోనని ఆందోళన చెందుతున్నారు. ఎన్నికలు వాయిదా పడటంతో మరి కొందరు ఆనందంలో ఉన్నారు. తర్వాత రిజర్వేషన్లు తమకు అనుకూలంగా వస్తుందో.. రాదోనని అయోమయంలో పడ్డారు.